హైదారాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మజ్లిస్ ను గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి వెనుకంజ వేస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ కు అత్యధిక మంది కార్పొరేటర్లున్నా ఎందుకు పోటీ చేయడం లేదు? అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో బీజేపీకి సరిపడా బలం లేకపోయినా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని తెలిపారు. మజ్లిస్ ను గెలిపించేందుకు కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉండాలనుకుంటోందని అన్నారు. దమ్ముంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టి వేర్వేరుగా పోటీ చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.