కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టుకోవచ్చు.. ఇంటర్నేషనల్ పార్టీ కూడా పెట్టొచ్చు.. అంతేకాదు చైనాలో కూడా పోటీ చేయొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. బీఆర్ఎస్.. అమెరికా, చైనాలోనూ పోటీ చేసుకొవచ్చని.. కానీ, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు
మునుగోడు ఉపఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు కమలదళంలో ఉన్న మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకు గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నారు.
టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చుతూ తీర్మానం చేసిన తర్వాత తొలిసారి హస్తినపర్యటనకు వెళ్లిన పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. అక్కడే మకాం వేశారు.. టీఆర్ఎస్ను జాతీయస్థాయిలో విస్తరించేందుకు వీలుగా బీఆర్ఎస్గా పేరు మార్చిన తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి.. యూపీ మాజీ సీఎం, ఎస్పీ మాజీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లిన కేసీఆర్.. అటు నుంచి నేరుగా హస్తినకు వెళ్లారు. ఆ తర్వాత…
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత తొలిసారి ఢిల్లీలో అడుగుపెట్టిన కేసీఆర్.. తన అధికార నివాసంలో బస చేస్తున్నారు.. ఈ వారాంతం వరకు హస్తినలోనే కేసీఆర్ మకాం వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.