బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది ఈడీ. వ్యాపార లావాదేవీలపై ఈడీ అధికారులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విచారించనున్నట్లు తెలుస్తోంది. 2014 నుంచి జరిపిన ఆర్థిక లావాదేవీలు, కంపెనీల వ్యవహారాలపై ఈడీ రోహిత్ రెడ్డిని ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ నా బయోడేటా అడగడం హాస్యాస్పదమన్నారు. బండి సంజయ్ చెప్పిన రెండు రోజలకే ఈడీ సమన్లు వచ్చాయని, బండి సంజయ్‌కి భవిష్యవాణి తెలుసా.. నాకు నోటీసులు వచ్చే విషయం బండి సంజయ్‌కి ఎలా తెలుసు అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Lady Fingers : అమ్మాయిలూ.. నానబెట్టిన బెండకాయ నీటితో ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
ఈడీ, సీబీఐలు బండి సంజయ్ కింద పనిచేస్తున్నాయా అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రను అడ్డుకున్నందుకే ఈ సమన్లు వచ్చాయని ఆయన వ్యా్‌ఖ్యానించారు. నాకు ఎటువంటి కేసుతో సంబంధము లేకుండా నోటీసు ఇవ్వడం…కిరాతకమని, ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. యాదగిరిగుట్టకు నేను తడి బట్టలతో రావడానికి సిద్ధం… బండి సంజయ్ ఎప్పుడు వస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు రోహిత్ రెడ్డి. అంతేకాకుండా.. ఈడీ నోతగ్గేది లేదు…భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. న్యాయ పరంగా బదులు ఇస్తానన్నారు.