సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశాఱు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర నిరాశ మిగిల్చారని, పోలీస్ విభాగంలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం గత ఆగస్టులో ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారని లేఖలో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా.. ‘కొలువులు వస్తాయని ఆశించిన యువతకు ఈ పరీక్ష తీవ్ర ఆవేదనను మిగిల్చింది. ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ విధానంలోనే కొలువుల భర్తీలో మీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంతో తెలుస్తోంది. ప్రిలిమినరీ రాత పరీక్షలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ రెండు ప్రశ్నపత్రాల్లో చెరో 7 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సంబంధించి అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది. ఈ 7 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సంబంధించి కొందరికి మార్కులిచ్చారు.
Also Read : Rajnath Singh: భారత్ సూపర్ కావాలన్నకుంటుంది ఇందుకే.. చైనాకు రాజ్ నాథ్ సింగ్ స్ట్రాంగ్ రిఫ్లై
అసలు సమాధానం ఇవ్వని వారికి సైతం మార్కులు కేటాయించారు. కానీ కొందరు అభ్యర్ధులకు మాత్రం మార్కులు ఇవ్వలేదు. ఈ విషయాన్ని అభ్యర్ధులు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) దృష్టికి తీసుకు వెళ్లారు. అయినా ఎటువంటి స్పందన లేకుండానే మెరిట్ జాబితాను రూపొందించి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీనిపై హైకోర్టు గత శుక్రవారం (డిసెంబర్ 9)న తీర్పునిచ్చింది. అభ్యర్ధులు పేర్కొన్న 7 ప్రశ్నలను తొలగించాలని ఆదేశించింది. ఆ మేరకు అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్లలో పాల్గొనే అవకాశమివ్వాలని కోరింది. హైకోర్టు తీర్పును అమలు చేస్తే దాదాపు 50-60 వేల మంది అభ్యర్ధులకు ఫిజికల్ టెస్టులకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది.
Also Read : ఇలాంటి సమయంలో సెక్స్ చేయకూడదు.. లేకపోతే ప్రాణాలు పోతాయ్..!
అభ్యర్ధులు తమ ఆవేదనను ట్విట్టర్ లో కేటీఆర్, డీజీపీలకు విన్నవించుకున్న సమాధానం రాలేదు. సంబంధిత శాఖను చూసే హోం మంత్రి ఉన్నాడా లేడో తెలియదు. మీరేమో ఇవేమీ పట్టన్నట్లు బీఆర్ఎస్ అంటూ దేశమంతా తిరుగుతుంటారు. పాలన ఈ విధంగా ఉంటే ఉద్యోగార్థుల సమస్యను తీర్చెదెవరు? హై కోర్టు ఆదేశించిన ప్రిలిమినరీ పరీక్షలోని 7 ప్రశ్నలకు మార్కులను కలిపి అభ్యర్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నా.’ అని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.