బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడంపై తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. నాకు నోటీస్ లు ఎందుకు ఇచ్చారో తెలియదు… నోటీస్ లో ఏమి లేదని అంటున్నాడు రోహిత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు రఘునందన్ రావు. ఎన్నికల అఫిడవిట్‌లో రోహిత్ రెడ్డి వేర్వేరు సమాచారాలను ఇచ్చారని, 2009 లో ఇచ్చిన అఫిడవిట్ లో B.TECH స్వీడన్ లో చేశాను అని చెప్పాడని రఘునందన్ రావు వెల్లడించారు. 2018 లో ఇచ్చిన అఫిడవిట్ లో కమర్షియల్ లైసెన్స్ , ఇంటర్ పాస్ అయ్యాను అని చెప్పాడని రఘునందన్ రావు తెలిపారు. బెంగుళూర్ డ్రగ్ కేసు విచారణ వేగవంతం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారన్నారు. కేటీఆర్, హరీష్ రావు, రోహిత్ రెడ్డి కి నోటీస్ లు ఇవ్వాలని ఎక్కడ చెప్పలేదని, రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్ దళితులకు అసైన్డ్ చేసిన భూములలో ఉందన్నారు. ఇంకో గెస్ట్ హౌస్ ఉంది ఆయనకు… ఆ గెస్ట్ హౌస్ లలో సినిమా వాళ్ళు వస్తుంటారని ఆయన వ్యాఖ్యానించారు. సర్పాన్ పల్లి ఫార్మ్ హౌస్ లో జరుగుతుంది ఏంటి అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Unstoppable 2: ‘బాహుబలి’ని ఉక్కిరిబిక్కిరి చేసిన బాలయ్య!
ప్రముఖ సినీ నటుడు తో కలిసి 200 ఎకరాలు ఏమో చేస్తున్నావు అట కదా.. నందు , సింహయజి లు నీకు తెలీదా.. వాళ్ళ టెలిఫోన్ కాల్ డేటా మమ్మల్ని బయట పెట్టమంటారా… మీ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన బెంగుళూర్ గోవిందా పూర్ పోలీస్ స్టేషన్ కి మీరు వెళ్ళారా లేదా. మీరు ఏ ఇన్నోవాలో వెళ్లారో , ఎవరిని తీసుకెళ్ళావో బయటకు పెడతాం.. నాకు డ్రగ్స్ తో సంబంధాలు లేవు, డ్రగ్స్ తీసుకో లేదు అని ఎందుకు ప్రమాణం చేయలేదు… ఎంఐఎం నేతలతో కలిసి విద్యా వికాస్ సమితి పేరు తో మీరు కబ్జా చేయాలని అనుకుంటున్న 200 కోట్ల రూపాయల భూమి విషయం ఈడి కి సమాధానం చెప్పాలి. తప్పుడు అఫిడవిట్ ల పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాము’ అని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.