బీఆర్ఎస్ పై ప్రతిపక్షాలు పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీలు మూడుకూడా ముకుమ్ముడి బీఆర్ఎస్ పై దాడి చేసేందుకు ప్లాన్ సిద్దం చేసుకుంటున్నారు.
నిజామాబాద్ జిల్లాలో BJP, BRS మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై మరొకరు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేస్తూ నగరంలో హల్చల్ సృష్టిస్తున్నాయి.
నేడు ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈడీ విచారణ తరువాత తొలిసారిగాని ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పర్యటించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు.
మంచిర్యాలలో పీపుల్స్ మార్చ్ సందర్భంగా భట్టి విక్రమార్క వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. లిక్కర్ స్కాం పై భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఢిల్లీ తరహాలో తెలంగాణ లో లిక్కర్ స్కాం జరుగుతుందని మండిపడ్డారు. లోతుగా విచారణ చేపట్టితే బయట పడుతుందని అన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కెటి రామారావు 'డిగ్రీ సర్టిఫికేట్' అంశంపై ప్రధాని నరేంద్ర మోడీని ఎగతాళి చేస్తూ, తన సర్టిఫికేట్లను బహిరంగంగా పంచుకోవడానికి ఇబ్బంది లేదని అన్నారు.
Poster War In Telangana: తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ల మధ్య పోస్టర్ వార్ ముదురుతోంది. నువ్వా నేనా అన్నరీతిలో పోస్టర్లు పెడుతూ ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్ పనులపై ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తూ పోస్టర్ వెలిసింది.