వంద కోట్ల ఇస్తే.. కేటీఆర్ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా ? అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. TSPSC పేపర్ లీకేజీ పై ఈడీ కి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర నేతలు పిర్యాదు చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు దొంగలే అని ఎం.ఎల్.సి. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీతో రైతులకు, కూలీలకు రక్షణ కల్పిస్తే.. మోడీ ప్రభుత్వం ఆదానీ, అంబానీలకు 12ల క్షల కోట్లు మాఫీ చేసిందని మండిపడ్డారు.
బీజేపీతని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ నేత జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధాని వ్యవహారంలో రాహుల్ గాంధీ గొంతు నొక్కే ప్రయత్నం బీజేపీ చేస్తుందని మండిపడ్డారు.
కేటీఆర్ పై కుట్రలు చేస్తున్నారు.. ప్రతిపక్షాల చర్యలు సరిగా లేవని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో నియంత పాలన సాగుతుందని అన్నారు.