CPI Narayana: వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ సర్కారుకు సీపీఐ మద్దతువిశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించొద్దంటూ కార్మికులు ఓ వైపు ఉద్యమాలు చేస్తుండగానే కేంద్రం మాత్రం దానిని విక్రయించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు బిడ్డింగులో పాల్గొనాలని సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలంగాణ సర్కారు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉంది. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొననుంది. ఈ మేరకు కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫ్యాక్టరీ నిర్వహణ కోసం మూలధనం/ ముడిసరుకుల కోసం నిధులు ఇచ్చి ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ప్రతిపాదనల బిడ్డింగులో సింగరేణి లేదంటే రాష్ట ఖనిజాభివృద్ది సంస్థ లేదంటే నీటిపారుదల శాఖ పాల్గొనే అవకాశం ఉంది.
Read Also: CPI Narayana: వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ సర్కారుకు సీపీఐ మద్దతు
స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి రమ్మని KCR పంపించారన్నారు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. కార్మికుల పోరాటానికి వెన్నుదన్నుగా నిలుస్తాం….బీజేపీని ఢీ కొట్టే నాయకుడు కేసీఆర్…అందుకే బిడ్ లో పాల్గోవాలని నిర్ణయించారు….AP కి విభజన హామీలు అమలు చేయకుండా BJP అన్యాయం చేసింది….విభజన హామీల సాధనకు BRS కట్టుబడి ఉంది.ప్రయివేటీకారణ వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది.
బీఆర్ఎస్ పోరాటం రాజకీయాలకు అతీతం….వేలాది మంది కార్మికుల ప్రయోజనాలు, పరిశ్రమ ఆస్తుల పరిరక్షణ BRS లక్ష్యం అన్నారు చంద్రశేఖర్. స్ట్రాటజిక్ సేల్ ను కేంద్రం సంహరించుకునే వరకు పోరాడతాం.ఆదానీ బొగ్గు నిల్వ చేసుకోవడానికి అవసరమైన భూములు కాజేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ప్రయివేటీకరణ…ఐదు వేల కోట్లు ఋణంగానో…..సహాయంగానో ఇవ్వకుండా నష్టాలను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ల్యాండ్ బ్యాంక్ ను రిలీజ్ చెయ్యాలి.. ఏపీ ప్రభుత్వం రుణ సహాయం చేసేందుకు ముందుకు రావాలన్నారు తోట చంద్రశేఖర్.
Read Also: HIV: జైల్లో 44 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్