Vizag Steel Plant: హీట్ పెంచుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్.. టార్గెట్ కేసీఆర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించి ఆహ్వానించిన బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగరేణి లేదా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లేదా నీటిపారుదల శాఖ తరఫున పాల్గొనే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ వైఖరిని వెల్లడించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, తెలంగాణలో చేపట్టిన మౌలికవసతుల ప్రాజెక్టులకు ఉక్కును సమకూర్చుకోవడం వంటి లక్ష్యాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనల కోసం వెంటనే విశాఖపట్నం వెళ్లి అధ్యయనం చేయాలని ఉన్నతాధికారుల బృందాన్ని కేసీఆర్ ఆదేశించారని చెబుతున్నారు. విశాఖలో స్టీల్‌ప్లాంట్ కార్మికుల నిరనసల్లో బీఆర్ఎస్ ఏపీ నేతలు పాల్గొనడం కూడా ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది..
ఈ వార్తలపై ఏపీ ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దన్నది తమ స్టాండ్ అన్నారు ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి అమర్నాథ్. స్టీల్ ప్లాంట్ పై మీడియాలో వస్తున్న వార్తలే తప్ప, ఇంతవరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నుండి కానీ, తెలంగాణ ప్రభుత్వం నుండి గాని ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదన్నారాయన. అయితే, స్టీల్‌ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ సర్కార్ పాల్గొంటుందన్న వార్తలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా స్పందించారు. ముందు నిజాం షుగర్ ఫ్యాక్టరీ, కాగజ్‌నగర్ పేపర్‌మిల్ తెరవాలన్నారు బండి. తెలంగాణ ప్రభుత్వం నిజంగా దీనిపై నిర్ణయం తీసుకుందా లేదా ఇదంతా ప్రచారమేనా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ సర్కార్ పాల్గొంటుందన్న ప్రచారం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు ఆచితూచి స్పందించిన ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునే ప్రయత్నం తొలి దశ నుంచి వైసీపీ చేస్తోందన్నారు వైవీ సుబ్బారెడ్డి.. ప్రధాని వద్ద కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించారన్న ఆయన.. చట్టపరమైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు పార్టీలు ఇంత కాలం ఏం చేశాయి ? అని నిలదీశారు..
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
తాజావార్తలు
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..