మహబూబాబాద్ జిల్లా మరిపెడలో హాకా చైర్మన్‌గా నియమించబడిన మచ్చ శ్రీనివాస్ కు జరిగిన ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్టంలో మొట్టమొదటి సారి ఇంత గొప్ప సమర్ధవంతమైన పదవి హకా చైర్మన్ ఇవ్వడం కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. మహాత్మా గాంధీ గొప్ప వ్యక్తి ఎలా అయ్యారు సహనం గల వ్యక్తి అది ఒక్క ఆర్యవైశ్యలకే ఉంటుందన్నారు. గంట పథంగా చెపుతున్నారు మీరంతా కేసీఆర్ వెంటే ఉంటామని అది హర్షణీయమని ఆయన అన్నారు. ఈ రోజు తెలంగాణ ఆర్ధిక రంగంలో వ్యవసాయ రంగ పరంగా దేశంలో మొట్టమొదటి గా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. గ్యాస్, పెట్రోల్ ధరలు దేశం భారీగా పెంచారని, సాగునీరు తెలంగాణ సాధ్యం అయినట్టు వేరే రాష్టాల్లో అయ్యిందా అని ఆయన ప్రశ్నించారు. పెళ్ళాం పిల్లలు లేనోళ్ల సత్యవంతుల.. పెళ్ళాం పిల్లలు ఉన్నవాళ్ళకి బాధ్యతలు తెలుస్తాయి వారికీ మాత్రమే కుటుంబం పాలనా తెలుస్తుందని ఆయన అన్నారు.
Also Read : Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూ ప్రకంపనాలు
దేశాన్ని పాలించిన అతిరధ రాజులూ పాలించారు చక్రవర్తులు పాలించారని, కానీ ఇంత నియంత పాలనా మోడీకే సాధ్యం అయ్యిందన్నారు. అద్వానీ నీ ఎలా కేసులలో ఇరికించి రాష్ట్రపతి పదవి కి దూరం చేసింది మోడీ కదా అని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రికి చదువు రాదని ఓ ముఖ్యమంత్రి ప్రశ్నిస్తే జరిమానా విధించే విజ్ఞత నీకె చెల్లుందని, రాబోయే రోజుల్లో కార్పొరేట్ కంపెనీ చేతుల్లోకి వెళ్లబోతుందన్నారు. రాహుల్ గాంధీ యంపీ సభ్యత్వాన్ని తొలగిస్తే ఎన్ని జాకీలు పెట్టిన లేసే పరిస్థితి లేదని, నిన్న ప్రధానమంత్రి వచ్చిన కారణం ప్రాంభమ్ చేసిన వాటినే మళ్ళి మళ్ళి చేసే కార్యక్రమమని, అనేక సార్లు కేంద్రం నుండి అభివృద్ధి చేసినందుకు అవార్డులు వస్తే మళ్ళి విమర్శలు వాళ్లే చేస్తరన్నారు. ఈ హకా ఛైర్మెన్ పదవి నా శాఖ లోనే ఉంటుంది నా శాయశక్తులా న్యాయం చేస్తాను నా సహకారం ఉంటుందని ఆయన వెల్లడించారు.
Also Read : GT vs KKR: నిలకడగా ఆడుతున్న గుజరాత్ టైటాన్స్.. 10 ఓవర్లలో స్కోరు ఇలా..