భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంపీ నామా నాగేశ్వర రావు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ.. సింగరేణి బలోపేతానికి తెలంగాణా ప్రభుత్వం కృషి చేస్తే నిర్విర్యానికి కేంద్రం యత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రధాని పర్యటనలో రాష్ట్రానికి కేంద్రం నిధులతో అభివృద్ధి అనేది భూటకమని ఆయన మండిపడ్డారు. నేషనల్ హైవేలలో కాంట్రాక్టర్స్ తో రోడ్ల నిర్మాణం ద్వారా భారీ టోల్ గేట్ లతో ప్రజల పై పెనుభారం మోపుతోందని, కేంద్రం నిధులెక్కడ అని ఆయన ప్రశ్నించారు. కొత్తగూడెం, సత్తుపల్లి రైల్వే లైన్ 800 కోట్లు మొత్తం సింగరేణి నిధులు ఇవ్వాలని, కేంద్రం ప్రభుత్వం మొత్తం నిధులు రాష్ట్రాల మీద అధారపడినవే, పన్నులు పెంచి రాష్ట్ర ప్రజల నుండి వసూళ్లు చేస్తున్నట్లు ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Helmetless Cops : మీరే ఇలా హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపితే ఎలా ?
5 ఏళ్లలో రాష్ట్రాల నుండి వసూళ్లు, ఈ రాష్ట్రానికి ఎంత కేటాయింపులు లెక్క బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 5 ఏళ్లలో 122 లక్షల కోట్లు రాష్ట్రాల నుండి కేంద్రానికి నిధులు వెళ్లాయని, .తెలంగాణా నుండి కేంద్రానికి 3.50 లక్షల కోట్లు వెళ్లగా, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది 81 వేల కోట్లు మాత్రమేనని, ప్రజలు గమనించాలన్నారు ఎంపీ నామా. అభివృద్ధి చూడాలంటే తెలంగాణ పల్లెలు, పట్టణాలు పరిశీలించాలని, చరిత్ర తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. తెలంగాణలో కొత్తగూడెం సహా 6 ఎయిర్ పోర్ట్ లు రావాలని, నవోదయ స్కూల్స్ ఏమయ్యాయని, బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీ ఎక్కడ, కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ, వాటి మీద సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.
Also Read : Umair Sandhu: బన్నీ-రష్మిక రిలేషన్షిప్… అది ట్విట్టరా లేక టాయిలెట్ కమోడా?