Jupally krishna rao: కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అరాచకాలపై మొరపెట్టుకుంటున్నా పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లే ముందు జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను బిఆర్ఎస్ ఉన్నాను లేనో పార్టీ అధినాయకత్వానికి తెలియాలి గత మూడేళ్లుగా పార్టీ సభ్యత్వ బుక్‌లెట్లు కూడా ఇవ్వలేదని జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అరాచకాలపై మొరపెట్టుకుంటున్నా పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఎస్సీ ,ఎస్టీ, బీసీ కమిషన్లను ఆశ్రయించాలని నాకు సలహా ఇచ్చారని అన్నారు. సాధించిన తెలంగాణలో అనుకున్న లక్ష్యాలు సాధించామా లేదా? అన్నది చూడల్సిన సమయం అన్నారు. సమైఖ్య రాష్ట్రంలో కూడా జరగని దాడులు ఇప్పుడు జరుగుతున్నాయని అన్నారు. ప్రగతి భవన్ ఆడమన్నట్టు ఆడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను పోటీ చేస్తే పోలింగ్ ఏజెంట్ లు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పార్టీ అధిష్టానం తనకు బి ఫారాలు కూడా ఇవ్వలేదన్నారు. అయితే తన మద్దతుదారులు స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దిశలో రాష్ట్రం నడుస్తుందో లేదో చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు, నియామకాలు, నిధుల విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గుర్తు చేశారు. ఆ దిశగా ప్రభుత్వం నడుస్తోందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు వివరించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. గతంలో అచ్చంపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి తాను హాజరయ్యానని జూపల్లి కృష్ణారావు తెలిపారు. తన స్నేహితుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు ఈరోజు కొత్తగూడెం వెళ్తున్నట్లు జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొంత కాలంగా బీఆర్ఎస్ నాయకత్వంపై జూపల్లి కృష్ణారావు అసంతృప్తితో ఉన్నారు. మాజీ మంత్రి కృష్ణారావు పార్టీ మారుతారనే ప్రచారం కూడా సాగుతుంది. ఈ తరుణంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి కృష్ణారావు వెళ్లడం ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
గతేడాది కొల్లాపూర్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత జూపల్లి కృష్ణారావు, హర్షవర్ధన్‌రెడ్డి వర్గీయుల మధ్య గ్యాప్ తగ్గుతుందని భావించారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో జూపల్లి కృష్ణారావు, హర్షవర్ధన్ రెడ్డిల మధ్య సవాళ్లు జరిగాయి. ఈ విషయంపై బహిరంగ చర్చకు సవాళ్లు చేశారు.
Sambasiva Reddy: సెంటు భూమి ఆక్రమించలేదు.. నిరూపిస్తే మీకే ఇచ్చేస్తా