కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినది చేస్తుంది.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర కి ఎందుకు వెళ్తున్నారు?.. రాష్ట్ర సంపదను మహారాష్ట్రలో ఎందుకు ఖర్చు చేస్తున్నారు?.. అని ప్రశ్నించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అని చెప్పిన కవిత బీఆర్ఎస్ పార్టీ ఎంత మంది మహిళలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా టికెట్లు ఇచ్చింది? అని షబ్బీర్ అలీ అడిగారు.
దళితులు గురించి మాట్లాడే నైతిక హాక్కు బీఆర్ఎస్ కి లేదు అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. కర్ణాటకలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా.. మీ నాయకులను అడగండి కాంగ్రెస్ పార్టీ ఎమీ చెసిందో?.. కవిత మీ కుటుంబతో కర్ణాటకకు రండి.. ప్రజా దర్బర్ నిర్వహిద్దాం.. మంత్రులకే అపాయిట్మెంట్ ఇవ్వాని కేసీఆర్ కామారెడ్డికి వచ్చి ఎమీ చేస్తాడు? అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం సభలో పచ్చి అబద్దాలు మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఒక్కటి కాదు.. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అలయ్.. బలయ్ చేసుకోని ప్రజలను మోసం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. ముదిరాజ్ సోదారులకు కులవృత్తి లేదు.. అలాంటి వారికి ఒక్క ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు అని షబ్బీర్ అలీ అన్నారు. ఇలాంటి వారిని గెలిపిస్తే.. రాష్ట్రాన్ని నాశనం చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Vadivelu: స్టార్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం