Kadiyam Srihari: న్యాయ విచారణ మొదలు కాకముందే మంత్రులు తీర్పులు ఇచ్చేస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు తెలంగాణ మంత్రుల బృందం వెళ్లి సందర్శించారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో ఐదుగురు మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు.. అధికారులపై మంత్రులు ప్రశ్నలు వర్షం కురిపించారని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల్లో 412 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది.. వాటికి నిధులు సమీకరించలేక శ్వేత పత్రాలు, న్యాయ విచారణల పేరిట డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజల ద్రుష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. శ్వేత పత్రాలు న్యాయ విచారణలని స్వాగతిస్తున్నాం.. మేమే విచారణలు కోరామన్నారు.
Naga Shaurya: పెళ్ళై ఏడాది కాకముందే నాగశౌర్య వేరు కాపురం.. షాకింగ్ విషయాలు చెప్పిన తల్లి
Also Read
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు.. కానీ 93 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయిందని పీపీటీలో వారే చెప్పారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఒక్క ఎకరం కూడా కాళేశ్వరం కింద పార లేదన్నారు.. వారిచ్చిన నివేదికలోనే 90 వేల ఎకరాల ఆయకట్టు వచ్చిందని తెలిపారు. తుమ్మిడిహట్టి దగ్గర తిరిగి ప్రాజెక్టు చేపడతామని ఉత్తమ్ అంటున్నారు.. నాడు వైఎస్ 2008 డిసెంబర్ 16 నాడు ప్రాణహితకు శంఖుస్థాపన చేశారు.. మహారాష్ట్ర అక్కడ ప్రాజెక్టుకు ఒప్పుకోలేదని అన్నారు. అక్కడ నీటి లభ్యత లేదని కేంద్ర జల వనరుల సంఘం లేఖ కూడా రాసిందని తెలిపారు. అన్నీ అంశాలు పరిగణనలోకి తీసుకుని మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకుని ప్రాణహిత ప్రాజెక్టును రీ డిజైన్ చేశారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. దాదాపు 11 రకాల అనుమతులు తీసుకున్నాకే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదిత ఆయకట్టు ఎక్కువగా ఉంది కనుకే అంచనా వ్యయం పెరిగిందని చెప్పారు. 140 టీఎంసీల మేర సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు కాళేశ్వరం కింద నిర్మించుకున్నాం కనుకే వ్యయం పెరిగిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టుతో పాటు పాత ఆయకట్టును స్థీరీకరించుకున్నామన్నారు.
Perni Nani: వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వలేదు..
మేడిగడ్డలో కొన్ని పిల్లర్లు కుంగిపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. న్యాయ విచారణ మొదలు కాకముందే మంత్రులు తీర్పులు ఇచ్చేస్తున్నారు.. న్యాయ విచారణను మంత్రుల వ్యాఖ్యలు ప్రభావితం చేసేలా ఉన్నాయని విమర్శించారు. మరోవైపు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కేసీఆర్ అడగలేదని ఉత్తమ్ అనడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. నేను డిప్యూటీ సీఎంగా ఉండగా.. కేసీఆర్ తో పాటు పీఎంను కలిసి కాళేశ్వరంకు జాతీయ హోదా అడిగామన్నారు. ఎన్నో సార్లు కేసీఆర్ పీఎం మోడీకి జాతీయ హోదా కోసం లేఖలు రాశారన్నారు. పాలమూరు రంగారెడ్డికి కూడా జాతీయ హోదా అడిగామని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుల అంచనాల వ్యయం పెరగడం గురించి విచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో అంచనాలు పెరగకుండా ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయా అని ప్రశ్నించారు. పదే పదే ఆయకట్టు పెరగలేదు అంటున్నారు.. అదే నిజమైతే తెలంగాణలో ఇన్ని కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి ఎలా సాధ్యపడుతుంది? అని కడియం ప్రశ్నించారు. వరి ధాన్యం సేకరణకు చెల్లించిన డబ్బులు చూస్తే ఆయకట్టు పెరిగిందా లేదా తెలుస్తుందని కడియం శ్రీహరి తెలిపారు.
తాజావార్తలు
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!