షెడ్యూలు కులాల వర్గీకరణ కోసం సుధీర్ఘ పోరాటం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. రాబోయే రోజులలో ఎస్సీ వర్గకరణపై నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి భరత్ కీలక పాత్ర పోషిస్తాడని అన్నారు.
వ్యవసాయం సంక్షోభంలో ఉందని, మన ప్రభుత్వం పోయి నాలుగు నెలల్లో ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనుకోలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం తెలంగాణ భవన్లో రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని, ఆ పార్టీది ‘ఆపన్న హస్తం కాదని, భస్మాసుర హస్తమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ‘పాంచ్ న్యాయ్’ పేరుతో మళ్లీ కొత్త హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందన్నారు. తెలంగాణను 10 ఏళ్లపాటు పాలించిన కేసీఆర్ రాష్ట్రంలో రైతుల దుస్థితికి ప్రధాన కారణమన్నారు.
Harsih Rao: బీజేపీ వాళ్ళు దీక్షలు చేయాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. జహీరాబాద్ లో BRS పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ..
BRS Rythu Deeksha: నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ రైతుదీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుండి బీఆర్ఎస్ రైతుదీక్షను ప్రారంభించనున్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కేసీఆర్ పూర్తి రాజకీయ దురద్దేశంతో ఆరోపణలు చేశారని.. కేసీఆర్ మాటల్లో అసత్యాలు, నిరాధారమైన ఆరోపణలు తప్పా ఒక్కటి నిజం లేదని మండిపడ్డారు. కేసీఆర్ కు అధికారం పోయిందనే బాధ ఆయన మాటల్లో, ఆయన ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు. తాను బీఆర్ఎస్ తప్పులను ఎత్తిచూపితే.. కేసీఆర్ అధికారం పోయిన ఫ్ట్రస్టేషన్ లో తనపై తప్పుడు ఆరోపణలు…
ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై రెండు మూడు రోజుల్లో స్పందిస్తానని తెలిపారు. పదేళ్ళపాటు సీఎంగా ఉన్నాను... కచ్చితంగా క్లారిటీ ఇస్తానని కరీంనగర్ పర్యటనలో ఉన్న ఆయన సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో చిట్ చాట్ లో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిజానిజాలు బయటపెడతానని కేసీఆర్ పేర్కొన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పొలంబాట కార్యక్రమంపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ రైతుల సమస్యలను పట్టించుకోలేదని.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఆయన ఒక్క రైతును పరామర్శించలేదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసి జైలుకి పంపించిన ఘనత కేసీఆర్ సర్కార్ కే దక్కిందని విమర్శించారు.
కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. చేనేత కార్మికులకు ఉపాధి ఇవ్వాలని అంటే.. ఓ కాంగ్రెస్ మంత్రి నిరోధ్లు, పాపడాలు అమ్ముకుని బతకమని అంటున్నారని కేసీఆర్ తెలిపారు. చేనేత కార్మికులు నిరోధ్లు అమ్ముకోవాలా కుక్కల కొడుకుల్లారా అంటూ విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో తామేమి రనౌట్ కాలేదు.. తమకంటే కాంగ్రెస్ కు 1.5 శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయని తెలిపారు. ఆ ఒకటిన్నర శాతం ఓట్లు కూడా తులం బంగారం, ఆరు…
ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయింది అనే అసహనం కేటీఆర్ లో ఉంది.. మరో వైపు చెల్లె జైల్లో ఉందని ఆరోపించారు. ట్యాపింగ్ చేశాం అని కేటీఆర్ ఒప్పుకోవాలని మంత్రి సీతక్క తెలిపారు. విచారణలో వాళ్ళ బంధువులే నిజాలు చెప్తున్నారు.. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఒప్పుకున్నాడు.. తప్పుకు శిక్ష అనుభవిస్తారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు అనే వైపు విచారణ జరగాలని మంత్రి సీతక్క కోరారు.