గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అధికారంలో నేతన్నల మీద ఉంది శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఇవాళ ఆయన రాజన్న సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నేతన్నల కోసం ప్రయోజనాలు తీసుకున్నది…
BRS Party: ఈ నెల 13 నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారు. చేవెళ్ల బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచారంలో బహిరంగ సభల కంటే బస్సు యాత్రలకే ప్రాధాన్యం మని భావించిన ఆయన చేవెళ్ల బహిరంగ సభలో ప్రచారం చేయనున్నారు.
Ponguleti: ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నలకు సాగునీటికి త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఎమ్మెల్సీ తాతా మధు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, వేలాదిమంది కార్యకర్తల శ్రమ, వందల మంది నాయకుల కష్టంతో కేసీఆర్ మార్గదర్శకత్వంలో నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తెల్లం వెంకటరావు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో భద్రాచలం నియోజకవర్గంలో ఏకైక స్థానాన్ని ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారని.. స్థానికుడు చదువుకున్న వ్యక్తి అని ఓటు వేసి…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో.. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కి కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలు వచ్చారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మా రెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
నటి, ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ “నేతాజీ భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి” అనే వ్యాఖ్యపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. X లో ఒక పోస్ట్ లో కథనాన్ని సుభాష్ చంద్రబోస్ యొక్క మనవడు చంద్ర కుమార్ బోస్ పంచుకుంటూ.., “ఎవరూ తమ రాజకీయ ఆశయం కోసం చరిత్రను వక్రీకరించకూడదు” అని అన్నారు. “నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక రాజకీయ ఆలోచనాపరుడు, సైనికుడు, రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గలవాడు అలాగే వీడిపోని…
Jagadish Reddy: కేసీఆర్ రాకతో లాగులు తడిసి బాహుబలి మోటర్లు అన్ చేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి అన్నారు. తుక్కుగుడా సభ పెట్టి మరొక సారి ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందని తెలిపారు.