కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పొలంబాట కార్యక్రమంలో భాగంగా ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల ఈ పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వ మాటలు అన్నీ మోసాలు.. అబద్ధాలు.. ఒక్క హామీ నెరవేరలేదని తెలిపారు. అసమర్థులు, చవట దద్దమ్మలు పాలనలో ఉన్నారు కాబట్టి ఈ స్థితి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో…
లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులతో మమేకమవుతున్నారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా.. కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా.. ముగ్ధుంపురంలో ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించారు. నీటి సమస్యలపై రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టంపై కేసీఆర్ ఆరా తీశారు. అయితే.. సాగునీటికి తీవ్ర ఇబ్బంది అవుతుందని రైతులు కేసీఆర్ కు తెలిపారు. గతేడాది నీరు సమృద్ధిగా ఉండేదని.. ఇప్పుడు పొలమంతా ఎండిపోయిందని…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీమంత్రి హరీష్ రావు లేఖ రాశారు. మేనిఫెస్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి.. మళ్ళీ ప్రజలను మోసం చేయొద్దు అని సూచించారు. మీ నాయకత్వంలోనే 2004, 2009 ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలను గుప్పిస్తూ మేనిఫెస్టోలను విడుదల చేశారు.. రెండు సందర్భాల్లోనూ అటు కేంద్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో మీరే అధికారంలోకి వచ్చారు. కానీ అప్పుడు ఇచ్చిన హామీలు వేటిని అమలు చేయలేదని లేఖలో ప్రస్తావించారు. 2023లో కూడా తెలంగాణలో అనేక…
మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. పాపన్నపేటలో నిర్వహించిన ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. పంటలు చేతికొచ్చినా రైతుబంధు రాలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడంటే అప్పుడు నీళ్లు ఇచ్చామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని వ్యవసాయం మీద దృష్టి పెట్టమంటే.. వలసల మీద దృష్టి పెట్టాడని విమర్శించారు. కాంట్రాక్టర్లకు నిధులు…
రాష్ట్రంలో ప్రశ్నించాలంటే భయం రాయాలంటే భయం ఉండేది… అటువంటి ప్రభుత్వం ఇప్పుడు లేదని డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హామీ ఇచ్చిన గారెంటీలని అందిస్తున్నామని, మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాల ఇచ్చామన్నారు. నేతలు చేసిన వాగ్దానాలు మార్చి పోయారని లేని పోని అభాండాలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరెంట్ పొకపోయిన పోయినట్లుగా ప్రభుత్వం పై విమర్శలు చేసి దిగజారుడు తనం బయట పడిందని ఆయన వ్యాఖ్యానించారు. వేసవి…
10 సంవత్సరాలు BRS అధికార దుర్వినియోగం తోకక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక పార్టీ లో గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీ లో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చిందన్నారు. కనీసం సిగ్గు లేకుండా రాజీనామా చేయకుండా మంత్రి పదవులు తీసుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఎజెండా పెట్టుకుంది… పిరాయింపులకి ప్రోత్సహిస్తుందన్నారు. కుక్కలను నక్కలని కేసీఆర్ ఎందుకు టికెట్ లు ఇచ్చారో చెప్పాలన్నారు కిషన్…
గతంలో అన్ని రంగాల్లో అవినీతి రాజ్యం ఏలింది అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గతంలో చేసిన తప్పులను రిదిద్దుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది తెలిపారు. వర్షాలు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ లలో నీళ్లు లేవు.. నాగార్జున సాగర్ లో గేట్లు ఎత్తిన నీళ్ళు రాని పరిస్థితి నెలకొంది.. ఈనాడు మంచి నీళ్లను ప్రక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పాడింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో తెలిపిన వివరాలు.. గతంలో మాదిరే నేతన్నలకు అర్డర్లు వేంటనే ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.
మాజీ సీఎం కేసీఆర్పై రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. నవ్వితే నాలుగేళ్లు అన్నట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పదేళ్లు కేసీఆర్ ప్రగతి భవన్లో, ఫాంహౌస్లో పడుకున్నారని.. తమ ప్రభుత్వం ప్రతి నిత్యం ప్రజల కోసమే పని చేస్తోందన్నారు.