సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో.. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కి కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలు వచ్చారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మా రెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
నటి, ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ “నేతాజీ భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి” అనే వ్యాఖ్యపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. X లో ఒక పోస్ట్ లో కథనాన్ని సుభాష్ చంద్రబోస్ యొక్క మనవడు చంద్ర కుమార్ బోస్ పంచుకుంటూ.., “ఎవరూ తమ రాజకీయ ఆశయం కోసం చరిత్రను వక్రీకరించకూడదు” అని అన్నారు. “నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక రాజకీయ ఆలోచనాపరుడు, సైనికుడు, రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గలవాడు అలాగే వీడిపోని…
Jagadish Reddy: కేసీఆర్ రాకతో లాగులు తడిసి బాహుబలి మోటర్లు అన్ చేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి అన్నారు. తుక్కుగుడా సభ పెట్టి మరొక సారి ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందని తెలిపారు.
షెడ్యూలు కులాల వర్గీకరణ కోసం సుధీర్ఘ పోరాటం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. రాబోయే రోజులలో ఎస్సీ వర్గకరణపై నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి భరత్ కీలక పాత్ర పోషిస్తాడని అన్నారు.
వ్యవసాయం సంక్షోభంలో ఉందని, మన ప్రభుత్వం పోయి నాలుగు నెలల్లో ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనుకోలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం తెలంగాణ భవన్లో రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని, ఆ పార్టీది ‘ఆపన్న హస్తం కాదని, భస్మాసుర హస్తమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ‘పాంచ్ న్యాయ్’ పేరుతో మళ్లీ కొత్త హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందన్నారు. తెలంగాణను 10 ఏళ్లపాటు పాలించిన కేసీఆర్ రాష్ట్రంలో రైతుల దుస్థితికి ప్రధాన కారణమన్నారు.
Harsih Rao: బీజేపీ వాళ్ళు దీక్షలు చేయాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. జహీరాబాద్ లో BRS పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ..
BRS Rythu Deeksha: నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ రైతుదీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుండి బీఆర్ఎస్ రైతుదీక్షను ప్రారంభించనున్నారు.