Kancharla Krishna Reddy: తెలంగాణలో అన్ని పార్టీలు ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి.. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసిన బీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది.. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూకుడు చూపిస్తోంది.. మరోవైపు నల్లగొండ లోక్‌సభ స్థానంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్.. ఇక్కడి నుంచి చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన పార్టీ సీనియర్ నేత కంచర్ల కృష్ణారెడ్డిని బరిలోకి దింపింది.. పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల సూచనల మేరకు నల్గొండ లోక్‌సభ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నేతల అభిప్రాయాలు తీసుకుని కంచర్లను పోటీకి దింపారు.. అయితే, చివరి నిమిషంలో బీఆర్ఎస్ నల్గొండ అభ్యర్థిని మార్చుతుందనే ప్రచారం సాగింది.. కానీ, వాటికి పార్టీ వర్గాలు, అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి కొట్టిపారేశారు.. ప్రచారం విస్తృతం చేశా.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తున్నానంటూ ధీమా వ్యక్తం చేశారు..
కాగా, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడే కంచర్ల కృష్ణారెడ్డి.. సోదరులిద్దరూ ఆది నుంచి పార్టీ నాయకత్వంపై విశ్వాసంతో పనిచేస్తారనే పేరుంది.. టీడీపీలో రాజకీయా జీవితాన్ని ప్రారంభించిన కంచర్ల సోదరులు.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలకు ఎదిగారు.. ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని పార్టీగా అండగా నిలిచారు. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో చోటుకున్న రాజకీయ పరిణామాలతో 2017లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.. తన చేరిక సమయంలో కంచర్ల కృష్ణారెడ్డి.. కేటీఆర్ సమక్షంలో చేసిన ప్రసంగం అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది.. ఇంతకాలం టీడీపీలో ఆ తారకరాముడు(ఎన్టీఆర్) కోసం పని చేశా.. ఇకపై బీఆర్‌ఎస్‌లో ఈ తారకరాముడు(కేటీఆర్) కోసం పనిచేస్తానని ప్రకటించడం అందరినీ ఆకట్టుకుంది.. ఇక, కంచర్ల సోదరులు బీఆర్ఎస్ గూటికి చేరిన తర్వాత 2018 ఎన్నికల్లో తమ్ముడు భూపాల్‌రెడ్డికి నల్లగొండ ఎమ్మెల్యే టికెట్ కేటాయించగా ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించిన కృష్ణారెడ్డి.. ఇప్పుడు ఎంపీ ఎన్నికల బరిలో దిగి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.. లోక్‌సభ స్థానం పరిధిలో తనకున్న పరిచయాలు ఓవైపు.. బీఆర్ఎస్ శ్రేణులతో కలుపుకొని ముందుకు సాగుతున్నారు.. ఆయన గెలుపు కోసం మాజీ మంత్రి జగదీష్‌రెడ్డితో పాటు తన సోదరుడు కంచర్ల భూపాల్‌రెడ్డి కూడా వ్యూహాలు సిద్ధం చేశారు.. రాష్ట్రస్థాయిలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నుంచి ఆయన సంపూర్ణ మద్దతు లభిస్తోంది.. పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో పాల్గొంటూ.. కేటీఆర్.. బీఆర్ఎస్ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు.
ఇక, తనపై నమ్మకంతో తనను అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన కంచర్ల కృష్ణారెడ్డి.. బీఆర్‌ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని ప్రకటించారు.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతోపాటు ఎంపీ బడుగుల, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, గుజ్జ దీపికలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ఇలా నల్గొండ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నేతల ప్రతి ఒక్కరి తోడ్పాటు మరవలేనిదని పేర్కొన్నారు.. వీరందరి సహకారంతో నల్గొండ లోక్‌సభ స్థానంలో విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.. కంచర్ల మల్లారెడ్డి, కౌసల్య దంపతులకు 10-05-1970న జన్మించిన కంచర్ల కృష్ణారెడ్డి స్వగ్రామం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల.. ఎంఏ, ఎల్ఎల్‌బీ పూర్తి చేసి హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు.. ఆయనకు భార్య సులోచన, కుమారుడు సమరసింహారెడ్డి ఉన్నారు.. టీడీపీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. ఇప్పుడు బీఆర్ఎస్ తరపున నల్గొండ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి విజయం సాధిస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.