వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది. ఇక నాల్గో విడత జరిగే ఎన్నికలకు ఈనెల 19న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు బీ-ఫారాలు అందించాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈనెల 18న తెలంగాణ భవన్‌లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీ ఫారాలు అందజేయనున్నారు. అదే సందర్భంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును ఎంపీ అభ్యర్థులకు అందజేయనున్నారు.
ఇది కూడా చదవండి: Alleti Maheshwar Reddy: కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు రాష్ట్ర బడ్జెట్ సరిపోదు..
అలాగే అదే రోజు జరిగే సుదీర్ఘ సమీక్షా సమావేశంలో ఎన్నికల ప్రచారం, తదితర వ్యూహాలకు సంబంధించి అధినేత సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు. ఆహ్వానితులందరికీ తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం లంచ్ ఏర్పాట్లు చేశారు. ఇక 18న జరగబోయే సమావేశంలో కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన రోడ్ మ్యాప్‌పై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.
ఇది కూడా చదవండి: AP Elections 2024: డ్వాక్రా గ్రూప్‌లకు ఈసీ కీలక ఆదేశాలు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మి మోసపోయారని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రజల్లో తీసుకెళ్తోంది. ఇక కేసీఆర్ చేపట్టబోయే బస్సు యాత్రలో కూడా కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అలాగే బస్సు యాత్రలో భాగంగా రైతాంగ కష్ట.. సుఖాలను కూడా కేసీఆర్ అడిగి తెలుసుకోనున్నారు.
ఇది కూడా చదవండి: Ponnala Lakshmaiah: కేసీఆర్, కేటీఆర్ లపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కాగా.. ఏప్రిల్ 26న సెకండ్ విడత, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక తెలంగాణలో మాత్రం మే 13న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.