KTR Twitter: భట్టి విక్రమార్క మాట మార్చారు.. కేటీఆర్ ట్వీట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Twitter: ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ. 4,000 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చాక.. అసలు అటువంటి హామీ ఏమివ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ 120 రోజుల పాలనలోనే నిరుద్యోగులతో పాటు అందరినీ మోసం చేయడం ప్రారంభించిందని విమర్శించారు.
Read also: Bear in Kamareddy: కామారెడ్డిలో ఎలుగుబంటి సంచారం.. భయాందోళనలో స్థానికులు
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు రూ.4వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చారని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 1 నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని పత్రికల్లో మొదటి పేజీల్లో జాబ్ క్యాలెండర్ ప్రచారం చేసింది. నిజానికి బీఆర్ఎస్ పాలనలో నింపబడిన 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి ఆ ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ సిగ్గులేకుండా తమ ఖాతాలో వేసుకుందని మండిపడ్డారు.
Read also: Chilkur Balaji Temple: చిలుకూరు ఆలయానికి క్యూ కట్టిన భక్తులు.. భారీ ట్రాఫిక్ జామ్
అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామన్న హామీపై యూ టర్న్ తీసుకుని టెట్ పరీక్ష ఫీజును రూ.400 నుంచి రూ.2 వేలకు (2 పేపర్లకు) పెంచిందని పేర్కొన్నారు. బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులను ఎన్నో కోర్టు కేసులు వేసి.. అనేక పోటీ పరీక్షలు రద్దవ్వడానికి కారణమయ్యారని తెలిపారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుని, ప్రతిఫలంగా వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడు కానీ.. ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులను మాత్రం దిక్కుతోచని స్థితిలో వదిలేసింది కాంగ్రెస్ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోందని అన్నారు. తమని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్!
అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
కానీ తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించింది.
👉 ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్…
— KTR (@KTRBRS) April 19, 2024
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!