B Vinod Kumar: జాతీయ రహదారుల కోసం పార్లమెంటులో గళ మెత్తింది నేనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ పట్టణం లోని అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ ను కలసి బోయినిపల్లి వినోద్ కుమార్ ప్రచారంలో మాట్లాడుతూ.. కరీంనగర్ కు ఎంపీగా స్మార్ట్ సిటి పనులకోసం రూ.1000 కోట్లు అభివృద్ధి పనులు తీసుకచ్చిన అన్నారు. మళ్లీ కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాలని ఉందన్నారు. బండి సంజయ్ కి ఓటు ఎందుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. కరీంనగర్ నుండి హైదరాబాద్ కు రైల్వే లైన్ తీసుకొచ్చింది నేనే మరి కొద్ది రోజుల్లోనే సిరిసిల్ల నుండి హైదరాబాదుకు రైలు మార్గం సుగమనం అన్నారు.
Read also: America: మూడు భారతీయ కంపెనీలపై అమెరికా నిషేధం
జాతీయ రహదారుల కోసం పార్లమెంటులో గళ మెత్తింది నేనే అన్నారు. కేంద్రంలో బీజేపీ మంత్రులను కలిసి అభివృద్ధి కోసం ఎన్నోసార్లు వివరించామన్నారు. ఏనాడు కూడా బీజేపీ ఎంపీ బండి సంజయ్ అభివృద్ధిపై కేంద్ర మంత్రితో కలిసిన దాఖలాలు లేవన్నారు. గత పది సంవత్సరాల నుండి బీజేపీ అధికారంలో అంబానీ ఆదానీల కోసం 13 లక్షల కోట్లు రుణమాఫీ చేసిందన్నారు. పెట్రోల్ నిత్యావసర వస్తువుల ధరలు పెంచింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం అన్నారు.
నేను గెలిస్తే బండి సంజయ్ రాజకీయ సన్యాసం తీసుకుంటానని చాలెంజ్ ఖండిస్తూ అతి త్వరలోనే తప్పకుండా బండి సంజయ్ సన్యాసం తీసుకునే రోజులు వస్తాయన్నారు. కరీంనగర్ ఎంపీగా మళ్లీ గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి మరింత అభివృద్ధి చేస్తా అన్నారు.
Fire Accident: కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం.. కూలర్ల షాప్ నుంచి ఎగిసిపడ్డ మంటలు..