Harish Rao: స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే నా రాజీనామా ఆమోదించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాసి స్పీకర్‌ను కోరారు. 2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల రూపంలో ప్రజలకు 13 హామీలు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. ఇవి కాకుండా 2023 డిసెంబర్ 9నాడు రైతులకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కూడా చేస్తామన్నారని తెలిపారు.
Read also: Prakash Raj: మార్పుకోసం.. నేను ద్వేషానికి వ్యతిరేకంగా ఓటు వేశాను : ప్రకాష్ రాజ్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 140 రోజులు దాటినా మహాలక్మి పేరిట ప్రతి నెల 18 యేండ్లు దాటిన వారందరికీ రూ. 2500 చొప్పున ఇస్తామన్న హామీ నెరవేరలేదన్నారు. రైతు భరోసా కింద రైతులకు, సౌలు రైతులకు ఎకరాకు రూ.15 పదిహేను వేల రూపాయల చొప్పున రైతు కూలీలకు ఏటా 12 వేల రూపాయల చొప్పున చెల్లించడం, పంటలకు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల బోనస్ చెల్లించడమనే హామీలు ఇంకా నెరవేరలేదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షల రూపాయలివ్వడం, ఉద్యమ కారులకు 250 చదరపు గజాల స్థలం ఇవ్వడం ఆదరణకు నేచుకోలేదన్నారు. యువ వికాసం కింద 5 లక్షల రూపాయల విలువైన విద్యా భరోసా కార్డు ఇస్తామని, ప్రతి మండలానికో ఇంటిర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు.
Read also: Ponnam Prabhakar: ఫిబ్రవరి 23, 2023న రుణమాఫీ చేస్తానన్నారు చేశారా? హరీష్ రావు కు పొన్నం ప్రశ్న..
చేయూత కింద ఇచ్చిన హామీ అయిన ఆసరా పెన్షన్లను 2 వేల రూపాయల నుంచి 4 వేల రూపాయలకు పెంచడం కూడా అమలు కాలేదని తెలిపారు. రూ.2 లక్షల రుణ మాపీ హామీని ఆగస్టు 15ను లోపు అమలు చేస్తానని దేవుడి పై ఒట్లు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ హామీ తో పాటు వందరోజుల్లో పూర్తి చేస్తామని చేయలేని గ్యారంటీలను కూడా ఆ రోజు లోగా నెరవేర్చాలని డిమాండ్ చేశాను. ఆగస్టు 15ను లోగా నెరవేర్చకపోతే సీఎం రాజీనామా చేయాలని, నెరవరిస్తే నేను రాజీనామా చేస్తానని సవాల్ విసిరాను. సవాల్ కు కట్టుబడి నేను ఈ రాజీనామా ప్రతిపాదన లేఖను మీ ముందు ఉంచుతున్నాను. 2024 ఆగస్టు 15లోగా పైన పేర్కొన్న హామీలన్నింటినీ అమలు చేసిన పక్షంలో ఈ లేఖను నా రాజీనామాగా పరిగణించి ఆమోదించాలని కోరుతున్నానని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.
Adulterated Mutton: కామారెడ్డిలో నాణ్యతలేని మటన్ కలకలం.. కుక్క గాట్లు గుర్తించిన జనం..