Harish Rao: రేపు గన్ పార్క్ దగ్గర వస్తా.. నీకు దమ్ముంటే రా..? రేవంత్ కు హరీష్ రావు మరో సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు మరో సవాల్ విసిరారు. రేపు ఉదయం 10 గంటలకు గన్ పార్క్ దగ్గర వస్తా అన్నారు. ఆగస్ట్ 15 లోగా రుణమాఫీ చేసేది నిజమైతే.. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్నారు. మనమిద్దరం మన రాజీనామా లేఖలని మేధావులకి ఇద్దామన్నారు. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తే నా రాజీనామా లేఖని స్పీకర్ కి ఇస్తా అన్నారు. నువ్వు చెయ్యకపోతే నీ రాజీనామా లేఖని గవర్నర్ కి ఇస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి నువ్వు సిద్ధమా..నీకు దమ్ముంటే రా..! అని మరో సవాల్ విసిరారు. కొడంగల్ లో తోక ముడిచినట్టే తోక ముడుస్తావా అన్నారు.
Read also: IPL 2024: సొంత ఆటగాడినే హేళన చేస్తారా.. ఇకనైనా ఆపండి! అక్రమ్ ఫైర్
Also Read
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
సిద్దిపేట బీజేపీ మీటింగ్ లో టెంట్ లు వేసి, కూలర్లు వేసి, వాటర్ బాటిళ్లు ఇచ్చి మీటింగ్ పెట్టుకున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మెదక్ లో మీటింగ్ పెడితే ఎండ కూడా భయపడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి కేసీఆర్ ఏం చేశాడు అని మాట్లాడుతున్నారని అన్నారు. ఏం చేసిండు బిడ్డా లిల్లిపుట్… నువ్వు మెదక్ వచ్చావు అంటే అది కేసీఆర్ వల్లనే అన్నారు. కేసీఆర్ మెదక్ ని జిల్లా చేస్తేనే నువ్ మెదక్ వచ్చావు… లేకపోతే సంగారెడ్డి లో నామినేషన్ వేసేవాడివి అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి స్క్రిప్ట్ రైటర్ సరిగా లేడు.. సరిగా రాసిస్తలేరన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇజ్జత్ మానం తీసుకుంటున్నాడని తెలిపారు. నీ పరువు పోతే పోయింది.. కానీ సీఎం పదవి విలువ తగ్గిస్తున్నావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో శివసేన రెడ్డి
బాండ్ పేపర్ కి వాల్యూ ఉండేది.. కాంగ్రెస్ వాళ్లు బాండ్ పేపర్ ఇచ్చిన తర్వాత దాని వాల్యూ కూడా పోయిందన్నారు. ఇప్పుడు ఎక్కడపోతే అక్కడ దేవుళ్ళకు దండం పెడుతున్నారని తెలిపారు. నా ఎత్తు గురించి మాట్లాడే ధ్యాస రేవంత్ కి ఉంది కానీ రైతుల వడ్లు అమ్ముడుపోతలేవు అది చూడు అన్నారు. బీజేపీ అభ్యర్థిరఘునందన్ రావు మాట నమ్మితే నీళ్లు లేని బావిలో దుకినట్టే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో ఏదేదో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. బీజేపీ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది కానీ పేదల గురించి పట్టించుకోదన్నారు. బీఆర్ఎస్ గెలుపు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుకు మలుపు అన్నారు.
CM Revanth Reddy: మోడీ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ చార్జీ షీట్.. విడుదల చేసిన సీఎం రేవంత్
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!