పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు అధికార పార్టీపై విరుచుకు పడుతున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. ఈ సారి బీఆర్ఎస్ ను ఎలాగైనా గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. అంతే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తైంది. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అభ్యర్థులు, వారి తరఫున హాజరైన ప్రతినిధుల ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు నియోజకవర్గా్ల్లో కీలక నేతలు జెండాలు మారుస్తున్నారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు వలసల బాట పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు హస్తం గూటికి చేరుకోగా మరి కొందరు కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి మరో రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ఈనెల 25న నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
CM Revanth Reddy: స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని మాజీ మంత్రి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్ కు అమరవీరుల స్థూపం గుర్తొస్తదన్నారు.
Minister Komati Reddy: నువ్వు బీఆర్ఎస్లో ఉద్యోగి మాత్రమే.. హరీష్ రావు కు మంత్రి కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు..నాటకాల రాయుడు అన్నారు.
Harish Rao: స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే నా రాజీనామా ఆమోదించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాసి స్పీకర్‌ను కోరారు.
B Vinod Kumar: జాతీయ రహదారుల కోసం పార్లమెంటులో గళ మెత్తింది నేనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ పట్టణం లోని అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ ను కలసి బోయినిపల్లి వినోద్ కుమార్ ప్రచారంలో మాట్లాడుతూ..
కాళేశ్వరం విషయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్ లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏడాదికి కరెంట్ బిల్లే రూ.10 వేల కోట్లు అవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు కూడా చేయలేదని విమర్శించారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కీలక నేతలు ఆ పార్టీ కి గుడ్ బాయ్ చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో పదవులను అనుభవించిన నేతలు ఇప్పుడు ఊహించని షాక్ ఇచ్చి కాంగ్రెస్, బీజేపీలోకి వెళుతున్నారు.