సిద్దిపేటను 40 ఏళ్లుగా ఒకే కుటుంబం దోచుకుంటుందని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. ప్రజలు ఆ కుటుంబాన్ని వద్దనుకొని బీజేపీని కోరుకుంటున్నారన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో రఘునందన్ రావు మాట్లాడారు.
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు మరో సవాల్ విసిరారు. రేపు ఉదయం 10 గంటలకు గన్ పార్క్ దగ్గర వస్తా అన్నారు. ఆగస్ట్ 15 లోగా రుణమాఫీ చేసేది నిజమైతే..
కేసీఆర్ కి నాలెడ్జ్ ఉంది అనుకున్న.. ఏం మాట్లాడిండో.. ఎందుకు మాట్లాడిండో అర్థం కాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎంత పని లెనోడు అయినా నాలుగు గంటలు లైవ్ లో మాట్లాడతాడా అని విమర్శించాడు. మెంటల్ గానికి ఎవరు ఏందో తెలియదని తనకు కాంట్రాక్టు పనులే లేవన్నారు.
ఈ ప్రభుత్వ హయాంలో రైతు బంధు, రైతు బీమా ఉంటుందో.. ఉండదో తెలియని పరిస్థితి ఏర్పడిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. బస్సు యాత్రలో భాగంగా సూర్యాపేటకు చేరుకున్న ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
రాష్ట్రంలో నీళ్ల పంచాయితీ మళ్లీ మొదలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత మొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రాజెక్టుల విషయంపై అధికార పార్టీ, బీఆర్ఎస్ నాయకులు రాళ్లు రువ్వుకున్నారు. తప్పు మీదంటే.. మీదంటూ ఒకరినోకరు విమర్శించుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి, అతడి కుమార్తె వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కావ్యపై తీవ్ర విమర్శలు చేశారు.
మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారని..అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నిన్న నాలుగు గంటలు టీవీ స్టుడియోలో ఎలా కూర్చున్నాడని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మందేసి గీశాడో.. దిగాక గేసాడోగానీ కూలిపోయిందని విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి తాను ఒక్కడే తెలంగాణ తెచ్చానని చెప్పుకుంటారని.. అది పచ్చి అబద్ధమన్న విషయం ప్రజలందరికీ తెలుసని కోదండ రామ్ అన్నారు. కాజిపేట్, మడికొండలో జరిగిన జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. కడియం కావ్యకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
B.Vinod Kumar: బండి సంజయ్ 5 ఏళ్లలో 5 రూపాయలు తీసుకురాలేదని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపి అభ్యర్థి బోయిని పల్లి వినోద్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలో బోయిని పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ..