బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైరయ్యారు. లక్ష్మణ్ పొలిటికల్ చిప్ ఖరాబైందని.. తక్షణమే రిపేర్ చేసుకుని మాట్లాడాలని సూచించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. కాగా.. రేపు తెలంగాణ భవన్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గులాబీ బాస్ కేసీఆర్ హాజరు కానున్నారు. తమకు సిట్టింగ్ స్థానంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని దక్కించుకోవాలని బీఆర్ఎస్ యోచనలో ఉంది. ఈ క్రమంలోనే.. కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ 2021-22కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఆరో అనుబంధ ఛార్జిషీట్ పరిశీలనపై అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవడంపై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది.
ఈ ఎన్నికల్లో అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శించిన క్షేత్రస్థాయి భారత రాష్ట్ర సమితి శ్రేణులు అందరికీ, పార్టీ నాయకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎదురుదెబ్బలు ఎన్ని కొట్టావు అన్నది కాకుండా.. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా సవాళ్లు ఎదుర్కొని తిరిగి నిలబడి పోరాటం చేశామన్నదే ముఖ్యం అన్న నానుడిని నిజం చేసిన పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత తిరిగి బలంగా నిలబడి కొట్లాడడం ఆషామాషి వ్యవహారం…
తెలంగాణలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. కాగా.. పోలింగ్ రాష్ట్రమంతటా ప్రశాంతంగా జరగ్గా, కొన్నిచోట్ల మాత్రం చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా.. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా పరకాల మండలం నాగారంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ సెంటర్ దగ్గర బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడే…
తెలంగాణలో కాసేపట్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. అక్కడక్కడా చెదురు ముదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పోలింగ్ కొనసాగింది. ఓటర్లు ఉత్సాహంగా తరలి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో మూడు గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52.30 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో ఒకట్రెండు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం జరుగుతున్నట్లు సీఈవో వికాస్‌రాజ్ వెల్లడించారు.
నల్గొండ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నల్గొండ లోక్ సభ లో పురుషుల కంటే మహిళ ఓట్లే అధికం ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
పదేళ్ల నిజం కేసీఆర్ పాలన, పదేళ్ల విషం బీజెపీ పాలన.. 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం వీటి మధ్యనే పోటీ జరుగుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ.."నరేంద్రమోడీ వస్తె కాలేజులు కట్టిన, రోడ్లు వేసిన అని చెప్పాలే.