ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ రాశారు. వ్యక్తిగత ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు రేవంత్ సూచించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని బీజేపీ ఆరోపించింది.
జయ జయహే తెలంగాణ గీతంపై కేసీఆర్, కేటీఆర్ అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమ పేరిట అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 10 సంవత్సరాలు జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించలేదన్నారు.
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర చిహ్న ఆవిష్కరణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో లోగో ఆవిష్కరణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
BRS Protest: నేడు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ రాజముద్రలో మార్పులపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేడు ఆందోళనకు పిలుపు నిచ్చింది.
ప్రజల దృష్టి మరల్చేందుకు ఫోన్ ట్యాపింగ్‌ను తెర పైకి తీసుకువస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. సర్కస్‌లో జోకర్‌గా అవసరం అయినప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంను తీసుకువస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటి వరకు సీఎం, మంత్రులు మాట్లాడలేదు.. కానీ లీకులు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్టపరంగా జరగాల్సింది జరుగుతుందని నిరంజన్ రెడ్డి తెలిపారు.…
కేసీఆర్ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ స్వయంకృపరాధమే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మీడియ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కి ప్రధాన భాద్యుడు కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ఇరుక్కాపోతాడని, కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు ను CBI విచారణ చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి మోడీ దేశం లో మత్తవిద్వేషాలు రెచ్చగొట్టేలా…
తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు ?? పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది ?? ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా ?? నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..! నేడు.. విత్తనాలు కొందామంటే…
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డీసీపీ రాధాకిషన్ ఫోన్ ట్యాపింగ్‌లో తన పేరు ఉందని చెప్పాడన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని నిన్నటి నుండి చాల బాధపడ్డానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌తో మాజీ ముఖ్యమంత్రి, కేటీఆర్, హారీష్ రావు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ నీచాతి నీచమైన చర్య అని మండిపడ్డారు. నా ఫోన్ ట్యాపింగ్…