ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కొందరు రాజకీయ నేతలను ఇరికించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవితపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒత్తిడి తెస్తున్నాయని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆరోపించింది . ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) యొక్క బలవంతపు చర్యలను చట్టవిరుద్ధం, అనైతికం , రాజ్యాంగ విరుద్ధమని బిఆర్ఎస్ పేర్కొంది, ఈ ఏజెన్సీలు బిజెపి పంథాను అనుసరించని ఎక్కువ మంది రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది. శుక్రవారం తీహార్ జైలులో…
MLC Jeevan Reddy: కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ని బీజేపీ దగ్గర కుదవపెట్టారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
KCR Protest: నేడు రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసన తెలపాలని సూచించారు.
రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రేస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి..ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం,మోసం చేయడం, దగా చేయడమే”…
ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరెంట్ కోతల విషయంలో వైఫల్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించలేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తాను ఖండిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు విద్యుత్‌ను సరఫరా చేసిందని, ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన విద్యుత్ వ్యవస్థను నిర్మించామని ఆయన తెలిపారు. కరెంట్ కోతలు సరిదిద్దాలనే…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అవుతుందని మాట్లాడేటోడికి.. మెదడు తక్కువ ఉన్నట్టు ఉందని దుయ్యబట్టారు. అది ఎప్పుడు చేస్తారో తెలియదు.. కేంద్రపాలిత ప్రాంతం అనేదే ఉండదన్నారు. కేటీఆర్ మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. సెకండ్ క్యాపిటల్ చేయండి అని కేటీఆర్ డిమాండ్ చేశాడు కదా అని ప్రశ్నించారు.