Home
Brs
Brs News
-
BJP Chargesheet: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్‌షీట్
కాంగ్రెస్ ఏడాది పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఆరు అబద్ధాలు-66 మోసాలు అంటూ బీజేపీ ఛార్జ్‌షీట్‌ను విడుదల చేసింది. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని .. హామీలు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు.. హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అనేక ప్రాణత్యాగాలతో తెలంగాణ సాధ్యం అయ్యిందన్నారు. -
Off The Record: దీక్షా దివస్ వెనుక BRS అధిష్టానం వ్యూహమేంటి.?
నవంబర్ 29. నేటి బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ చరిత్రలో మర్చిపోలేని రోజు. తెలంగాణ ఉద్యమ పథంలో... ఆఖరి అస్త్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్న రోజు. 2009లో అదే రోజున ఆయన దీక్ష ప్రారంభించడం, ఆ తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడుతున్నామన్న నాటి కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో కేసీఆర్ దీక్ష విరమించడం తెలిసిందే. ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత వరుసగా పదేళ్ళు అధికారంలో ఉంది బీఆర్ఎస్. నవంబర్… -
Kishan Reddy: ఏడాది అయినా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్, బీఆర్ఎస్లా కుటుంబం ఆధారంగా నడిచే పార్టీ కాదని.. ప్రజాస్వామ్య బద్ధంగా నడిచే పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బూత్ స్థాయి నుండి మంచి నాయకత్వం రావాలి.. మంచి కమిటీలు ఏర్పాటు కావాలన్నారు. బీజేపీ వర్క్ షాప్‌లో కిషన్ రెడ్డి మాట్లాడారు. -
R.S. Praveen Kumar: నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదు.. కొండా సురేఖపై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్..
R.S. Praveen Kumar: నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదు.. కొండా సురేఖపై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్ అయ్యారు. తాజాగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ఆర్ఎస్ కుట్రచేసి విషఆహారం తినిపిస్తున్నారని అన్నారు. -
KTR: చరిత్ర చదవకుండా.. భవిష్యత్‌ను నిర్మించలేం..!
చరిత్ర చదవకుండా భవిష్యత్‌ను నిర్మించలేమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కోసం మరొక్కసారి దీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ భవన్లో దీక్షా దివస్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. ఆత్మగౌరవం.. అస్తిత్వం.. ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసినవాళ్లమవుతామన్నారు. -
MLC Kavitha: ప్రాణాలకు తెగించి కేసీఆర్ దీక్షకు బయలుదేరిన రోజు ఇది..
ఈ రోజు బీఆర్ఎస్కు ఎంతో గుర్తు పెట్టుకునే రోజు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రాణాలకు తెగించి కేసీఆర్ దీక్షకు బయలుదేరారన్నారు. 15 సంవత్సరాల క్రితం కేసీఆర్ మా మాట కూడా వినకుండా.. తెలంగాణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుకు వెళ్లారన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్‌ను ఓ పండుగలా జరుపుకుంటుందన్నారు. -
Minister Konda Surekha: ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం!
రేవంత్ రెడ్డి పాలనను అడ్డుకోవాలని చూస్తున్నారని.. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వాంకిడిలో చనిపోయిన విద్యార్థి కుటుంబానికి ఒక ఇందిరమ్మ ఇల్లు, ఒక ఉద్యోగం ఇస్తున్నామన్నారు. గురుకుల విద్యార్థిని మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారన్నారు. -
KTR: కరీంనగర్ సింహగర్జనతో కేసీఆర్ ఉద్యమబాట పట్టారు..
తెలంగాణకు పునర్జన్మనిచ్చింది కరీంనగర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కరీంనగర్ జిల్లా అల్గునూర్‌లో దీక్షా దివస్ సభలో కేటీఆర్ ప్రసంగించారు. 1956 నుంచి 1968 వరకు తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలయ్యిందన్నారు. -
Kadiyam Srihari: తప్పు చేశాడు కనుకే భయపడుతున్నాడు.. కేటీఆర్‌పై కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులపై దాడులు చేయడానికి రైతులను ఉసిగొలుపుతున్నారని అన్నారు. కేటీఆర్‌కు పార్టీని ఎవరు ఏం చేస్తారో అని.. గతంలో చేసిన తప్పులకు ఎప్పుడు జైలుకు పోవాల్సి వస్తుందో అని రెండు భయాలు ఉన్నాయని అన్నారు. ప్రజల్లో సానుభూతి కోసమే జైలుకు పోతానంటున్నారని కడియం శ్రీహరి చెప్పారు. -
Harish Rao: కేంద్రాన్ని, పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారు.. ప్రభుత్వంపై విమర్శలు
మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూసీ డెవలప్మెంట్ పైన పార్లమెంట్లో ఒక ప్రశ్న లేవనెత్తాము.. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నామని రాష్ట్రం చెప్పిందని కేంద్రమంత్రి చెప్పారు.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని, పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించిందని హరీష్ రావు ఆరోపించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!