శాసనసభలో తప్పుడు ప్రకటనలతో అసెంబ్లీని కాంగ్రెస్ తప్పుదోవపట్టిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు.
CM Revanth Reddy: ఆగస్టు 1, 2న బీఆరెస్ పదేళ్ల పాలనపై చర్చకు సిద్దమని జగదీష్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మీరెంత అబద్ధాలు చెబితే నేను అంత నిజాలు చెబుతా అన్నారు.
మేడిగడ్డ బారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి కాంగ్రెస్ కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు అన్నారు. ఇవాళ ఆయన బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన చెక్కుచెదరని బ్యారేజ్ ఎన్నికల ముందు అలా ఎందుకు అవుతుందని, ఎన్నికలకు ముందే బ్యారేజ్ పరిస్థితి ఎందుకు అలా అవుతుంది? అని ఆయన ప్రశ్నించారు. మున్ముందు బారేజ్ కు ఏమీ జరిగినా ఈ ప్రభుత్వ కుట్ర ఫలితమే అని భావించాల్సి ఉంటుందని, ఒకరిద్దరు మంత్రులకు…
ఆగస్టు 2 లోపు కాళేశ్వరం నుంచి పంపింగ్ స్టార్ట్ చేయకపోతే రైతులతో కలిసి మేమే పంపులు ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆయన పార్టీ నేతలతో కన్నెపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించి మాట్లాడారు. తెలంగాణలో కరువు అనే మాట వినపడకూడదనే ఉద్దేశతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆయన వెల్లడించారు.
వలం కమీషన్ల కక్కుర్తి కోసం బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లను తీసేసి కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కట్టారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 30 వేల కోట్ల నుంచి 80 వేల కోట్లకు పెంచి బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే వరకు అయ్యిందని.. కాళేశ్వరం మొత్తం పూర్తి కావడానికి రూ. లక్షా 47 వేల కోట్లు అవసరం అవుతాయని కాగ్ స్పష్టం చేసిందన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. నిన్న బడ్జెట్ మీద పదేళ్లు అనుభవం ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని బడ్జెట్ విషయంలో చీల్చి చెండాడుతాం అన్నారని.. అలాంటి కేసీఆర్ పదేళ్లలో వాస్తవిక బడ్జెట్ పెట్టలేదని విమర్శించారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొదటి సారి బడ్జెట్ పెట్టినా.. మీలాగా గ్యాస్...స్ట్రాష్ బడ్జెట్ పెట్టలేదంటూ పేర్కొన్నారు.
MLC Jeevan Reddy: ఇప్పటికైనా మీ విహార యాత్రను ఆపాలని బీఆర్ఎస్ నాయకులపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులు కాళేస్వరం ప్రాజెక్ట్ కు పోతుంటే అచ్చర్యం కలుగుతుందన్నారు.
BRS Leaders Kannepalli Pump House Today: ఆగస్టు 2వ తేదీలోపు కన్నెపల్లి పంప్‌హౌజ్‌లు ప్రారంభించకపోతే.. 50 వేల మంది రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తాం అని తెలంగాణ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ గుండె లాంటిందని, రాష్ట్రంలో కరువు అనే మాట వినపడకుండా ముందు చూపుతో కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారన్నారు. కాళేశ్వరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, చిన్న సమస్య తలెత్తితే ప్రాజెక్ట్‌పై విష ప్రచారం చేస్తున్నారని…