CM Revanth Reddy: బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం తథ్యమని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు తన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండించినా.. అది ఎప్పటికీ జరుగి తీరుతుందని అన్నారు. విలీనం అయిన వెంటనే కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్రమంత్రి పదవి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో హరీష్ రావు ప్రతిపక్ష నేత అవుతారని అన్నారు. విలీనం, పదవులు రాగానే.. కవితకు నాలుగు రాజ్యసభ సీట్లతో సమానంగా బెయిల్ వస్తుందని వెల్లడించారు. అదేవిధంగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు.
Read also: Flowers Price: శ్రావణ మాసం ఎఫెక్ట్.. కొండెక్కిన పూల ధరలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ బిజీ షెడ్యూల్ లో ఉన్నారు. ఈరోజు ఢిల్లీలో ఫాక్స్‌కాన్-యాపిల్ మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సొంత దేశంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఫాక్స్‌కాన్-యాపిల్ మాన్యుఫ్యాక్చరర్స్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి అధికార యంత్రాంగంలోని పెద్దలను కూడా కలిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ లు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. వరంగల్‌లో జరిగే రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని సీఎం ఆహ్వానించనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సోనియాను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు మూడు రోజుల పాటు సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉండనున్నారు.
Nandamuri Balakrishna: సత్యసాయి జిల్లా కేంద్రం మార్పు..! బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు