ఫార్ములా ఈ రేసు కేసులో గతంలో తాను వాడిన మొబైల్ ఫోన్ సమర్పించాలని ఈ నెల 16న ఏసీబీ ఇచ్చిన నోటీసుపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ లేఖ ద్వారా ఏసీబీ కి సమాధానం పంపించారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఈ నెల 13న మీరు పంపిన లేఖ మేరకు 16వ తేదీ ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయంలో స్వయంగా విచారణకు హాజరయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు గాయమైంది. జిమ్ వర్కౌట్ సెషన్‌లో స్లిప్ డిస్క్ గాయం అయినట్లు కేటీఆర్ తెలిపారు. కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. వైద్యుల సలహా మేరకు రెస్ట్ తీసుకొని త్వరలో తిరిగి వస్తానని ఆశిస్తున్నాను అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. త్వరగా కోలుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు.
దశాబ్దాలుగా మూసీ నదిపై కాంగ్రెస్ దీర్ఘకాల నిర్లక్ష్యం, పునరుజ్జీవన ప్రాజెక్టు బాధితుల బాధల నుంచి దృష్టి మరల్చేందుకు నల్గొండలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన మూసీ పాదయాత్ర రాజకీయ స్టంట్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అభివర్ణించారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లో ఇళ్లు కూల్చే ప్రమాదంలో ఉన్న బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.
కేటీఆర్ నోటీసులకు భయపడేది లేదన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉడుత ఊపులకు భయపడేది లేదని.. బండి సంజయ్ అన్నారని.. మళ్లీ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బండి సంజయ్ తనకు లీగల్ నోటీసులు ఇస్తే, తాను మళ్లీ మళ్లీ లీగల్ నోటీసులు పంపిస్తానన్నారు. రాహుల్ గాంధీకి మోడీ లీగల్ నోటీసులు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. లీగల్ నోటీసుల విషయంలో మాత్రం మోడీని అనుసరిస్తానని తెలిపారు. READ MORE: Jammu…
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటన దేశాన్నే కలచివేస్తుందన్నారు. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, మహిళలపై క్రూరత్వం వంటి ఘటనలు సిగ్గు పడేలా ఉన్నాయని తెలిపారు.
KTR: తప్పుడు ఆరోపణలు చేస్తే లీగల్ నోటీసు పంపుతా.. కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
BRS KTR: కుట్రపూరితంగా అసత్యాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు పెడతామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.