KTR: ఆ ఒక్క విషయంలో మోడీని అనుసరిస్తా.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్
- ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని కేటీఆర్ ప్రశ్న
- తనకు లీగల్ నోటీసులు ఇస్తే.. తాను కూడా మళ్లీ మళ్లీ పంపుతానన్న మాజీ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేటీఆర్ నోటీసులకు భయపడేది లేదన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉడుత ఊపులకు భయపడేది లేదని.. బండి సంజయ్ అన్నారని.. మళ్లీ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బండి సంజయ్ తనకు లీగల్ నోటీసులు ఇస్తే, తాను మళ్లీ మళ్లీ లీగల్ నోటీసులు పంపిస్తానన్నారు. రాహుల్ గాంధీకి మోడీ లీగల్ నోటీసులు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. లీగల్ నోటీసుల విషయంలో మాత్రం మోడీని అనుసరిస్తానని తెలిపారు.
READ MORE: Jammu Kashmir: విద్యార్థులకు దీపావళి గుడ్‌న్యూస్.. విద్యాసంస్థలకు 5 రోజులు సెలవులు
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా స్పందించారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక.. లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి కేటీఆర్ నాకు లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూశానని తెలిపారు. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరని అన్నారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందన్నారు. తాటాకు చప్పళ్లకు భయపడేది లేదన్నారు. నాపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరే.. అన్నారు. అందుకు బదులుగానే నేను మాట్లాడిన అన్నారు. ఆయన సుద్దపూస అనుకుంటున్నాడేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భాగోతం ప్రజలకు తెలుసని అన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసని అన్నారు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చిన అన్నారు. లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తా. మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులం అన్నారు. చట్టం, న్యాయం ప్రకారం కూడా ముందుకు వెళతామని తెలిపారు.
READ MORE: Actor Bala: కోట్ల ఆస్తి కోసం 4వ పెళ్లి చేసుకున్న నటుడు
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!