KTR Hhouse Arrest: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమం ప్రకటించారు. ఈ రోజు ఉదయం బస్ భవన్ కి సిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఉదయం 8.45కి రేతిబౌలి నుంచి బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కేటీఆర్, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు నిర్ణయించారు. ముందుగానే రంగంలోకి దిగిన పోలీసులు.. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
Mulugu: నేడు ములుగు జిల్లా కేంద్రంలో నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. అయితే ఈ నిరసనకు పోటీగా.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపు ఇచ్చింది. అయితే నేడు జిల్లాలో మంత్రివర్యుల పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ చేపట్టివలసిన నిరసన కార్యక్రమం రేపటికి వాయిదా పడింది. ములుగు జిల్లాలో నేడు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పర్యటన చేపడుతున్నారు. ములుగు జిల్లాకు వస్తున్న తుమ్మల నాగేశ్వరరావుకి ఘట్టం దగ్గర ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు.…
KTR : కరీంనగర్ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్‌లో ఆదివారం ఒక అపశృతి చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ పద్మజను పార్టీ కార్యకర్త శ్రీకాంత్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు విరిగింది. వెంటనే పార్టీ శ్రేణులు ఆమెను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కేటీఆర్, ఆసుపత్రి అధికారులను సంప్రదించి, ఆమెకు అత్యవసర వైద్యసేవలు అందించాలని సూచించారు. తెలంగాణలో గత 14 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం…