Mulugu: నేడు ములుగు జిల్లా కేంద్రంలో నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. అయితే ఈ నిరసనకు పోటీగా.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపు ఇచ్చింది. అయితే నేడు జిల్లాలో మంత్రివర్యుల పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ చేపట్టివలసిన నిరసన కార్యక్రమం రేపటికి వాయిదా పడింది. ములుగు జిల్లాలో నేడు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పర్యటన చేపడుతున్నారు. ములుగు జిల్లాకు వస్తున్న తుమ్మల నాగేశ్వరరావుకి ఘట్టం దగ్గర ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు. ఘట్టం నుంచి భారీ ర్యాలీగా వెంకటాపురం వాజేడుకు మంత్రుల కాన్వాయ్ చేరుకుంది.
Read Also:Woman Swallows Pens: ఇదేందయ్యా ఇది..! భర్త మీద కోపంతో పెన్నులు మిగింది.. చివరకు..!
ఐకమరోవైపు శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు, మంత్రుల పర్యటన నేపథ్యంలో ములుగు జిల్లాలో పలువురు కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కార్యక్రమం నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ములుగు జిల్లా బీఆర్ఎస్ ఇంచార్జ్ బడే నాగజ్యోతి ములుగు చేరుకున్నారు. ఆ తర్వాత గాంధీచౌక్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీని నిర్వహించాయి బీఆర్ఎస్ శ్రేణులు.
Read Also:Xiaomi YU7 SUV: 3 నిమిషాల్లో 2 లక్షల బుకింగ్‌లు.. ఆటో మార్కెట్‌లో సంచలనం
ఇక నిరసన ర్యాలీలో ములుగు జిల్లాలో శాంతిభద్రతలను కాపాడాలంటూ నిరసన నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ములుగు ఇంచార్జ్ బడే నాగజ్యోతిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు పోలీసులు. ఈ అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలకి పోలీసులకు మధ్య స్వల్ప తాపులాట జరిగింది. ఆ తర్వాత కూడా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిరసన ర్యాలీని కొనసాగించారు. ఆపై మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి పెద్ది సుదర్శన్ రెడ్డి ములుగు ఎటునాగారం జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ శాంతియుత నిరసన, కాంగ్రెస్ పోటీ నిరసన పిలుపు కార్యక్రమాలతో ములుగులో రాజకీయ వాతావరణం వేడెక్కింది.