బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటానికి సిద్ధపడింది. ఆటో డ్రైవర్ల సమస్యలే పరిష్కారం దిశగా సోమవారం గులాబీ పార్టీ నేతలు ఆందోళనలు.. నిరసనలకు రెడీ అయ్యారు. సోమవారం హైదరాబాద్ నగర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టనున్నారు. ఆటోల్లో ప్రయాణం చేస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
Mulugu: నేడు ములుగు జిల్లాలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు, పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే గత రాత్రి వాజేడు మండల కేంద్రంలో కురిసిన వర్షం వల్ల ముందుగా ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాల ప్రాంగణం సభకు పనికి రాకుండా పోవడంతో, చెక్కుల పంపిణీ సభను ఐటీఐ కళాశాల వద్దకు మార్చారు. ఈ కార్యక్రమంలో గత సంవత్సరం మొక్కజొన్న పంటలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులను…
KTR: ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ పూర్తయింది. ఉదయం 10:40 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగింది. దాదాపు 7 గంటలపాటు ఈడీ అధికారులు కేటీఆర్‌ను వివిధ అంశాలపై ప్రశ్నించారు. నగదు బదిలీ చుట్టూనే ఈడీ ప్రశ్నలు తిరుగాయని, నిబంధనలు పాటించకుండా పౌండ్లలోకి మార్చి పంపడంపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. HMDA ఖాతా నుంచి విదేశీ కంపెనీకి నిధులు బదలాయింపుపైనే…
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కోకాపేటలోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. “డీజీపీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపాటు పనిచేయదు. బెయిలబుల్ సెక్షన్స్ లో అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణం. ఇలాంటి కేసుల్లో నాయకులు చెబితే వినడం కాదు, చట్టాలకు లోబడి పని చేయాలి. బెయిలబుల్ కేసులు అని తెలిసి రాత్రంతా ఇబ్బంది పెట్టారు. బెయిలబుల్ సెక్షన్లకు…
నిన్న రాత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కౌశిక్‌ను పోలీసులు రాత్రంతా త్రీ టౌన్ పీఎస్ లోనే ఉంచారు. ఎమ్మెల్యేపై ఇప్పటికే వన్ టౌన్ లో మూడు, త్రీ టౌన్ లో రెండు, మొత్తం ఐదు కేసుల నమోదు చేశారు. రెండు కేసుల్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆర్డీవో మహేశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు..మొత్తం 12 సెక్షన్ల కింద కేసులు నమోదు…
కౌశిక్ రెడ్డి అరెస్ట్ కేసులో రాత్రంతా హైడ్రామా, హైఅలర్ట్ కొనసాగింది. ఎమ్మెల్యే కౌశిక్‌ను పోలీసులు రాత్రంతా త్రీ టౌన్ పీఎస్ లోనే ఉంచారు. రాత్రి కౌశిక్ రెడ్డి నిద్రించేందుకు బెడ్ తెప్పించి ఏర్పాటు చేశారు. రాత్రి ఒంటిగంటకు అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్ లీగల్ టీంకు తెలిసింది. రాత్రి త్రీ టౌన్ లోనే వైద్య పరీక్షలు పూర్తి చేశారు. మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు.
Padi Kaushik Reddy : బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద కేసులా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, 13 నెలల కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా మారడం శోచనీయమని, ప్రశ్నిస్తున్న ప్రజా…
Jagadish Reddy : బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆందోళనకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి భువనగిరి వెళ్తుండగా, ఘట్కేసర్ వద్ద పోలీసులు జగదీష్ రెడ్డిని అడ్డుకున్నారు. ఈ…
కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు చేయనున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది.