Harish Rao : ప్రభుత్వ ఫెయిల్యూర్‌కు ఇదే నిదర్శనమని, జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం, మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం బాధాకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేదని ములుగు జిల్లా, బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగయ్య అనే దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం మనస్సు కలిచివేసిందన్నారు. గ్రామ సభల్లో జరుగుతున్న ఇలాంటి వరుస…
Sabitha Indra Reddy : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి యూజీసీ రూపొందించిన ముసాయిదా రాష్ట్రాల హక్కులను హరించేలా ఉందని విమర్శించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై చర్చించేందుకు తెలంగాణ భవన్లో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ ఆదేశాలతో పార్టీ వైఖరిని నిర్ణయించేందుకు అనేక నాయకులు పాల్గొన్నారు. సబితా మీడియాతో మాట్లాడుతూ, యూజీసీ ప్రతిపాదించిన నిబంధనలపై అభిప్రాయాలు తెలియజేయాల్సిన గడువు ఈ నెల 30వరకు ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం…
తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సమావేశం కొనసాగింది. సుమారు రెండున్నర గంటల పాటు భేటీ జరిగింది. జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసంతో పాటు పలు రాజకీయపరమైన అంశాలపై చర్చ జరిగింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ ఎమ్మెల్యేలు లంచ్ భేటీ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది.
Madhavaram Krishna Rao : గడిచిన సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ అభివృద్ధిని అటుకెక్కించి ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్ పల్లి కె.పి.హెచ్.బి కాలనీలోని ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న వేణుగోపాల స్వామి ఆలయ మండపాన్ని హౌసింగ్ బోర్డ్ అధికారులు సీజ్ చేసిన విషయాన్ని తెలుసుకొని స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు తో కలిపి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వేణుగోపాల…
KTR : రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ ధర్నాకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ధర్నా ప్రతిపాదిత స్థలం హైవే వెంట ఉండటం, జిల్లాలో గ్రామసభలు జరుగుతుండడం, సంక్రాంతి హడావిడి నెలకొన్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఇవ్వలేమని బీఆర్ఎస్ పార్టీకి తేల్చి చెప్పారు పోలీసులు. రేపటి మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో లంచ్…
Rasamayi Balakishan : కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం గార్డెన్లో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. తెలంగాణ పార్టీ ఏది అంటే ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ జెండానే చూపిస్తారన్నారు. దేవుడులాంటి కేసీఆర్‌ను దూరం చేసుకొని దయ్యం లాంటి రేవంత్ రెడ్డి తెచ్చుకున్నమని ప్రజలంతా బాధపడుతున్నారని, అర గ్యారెంటీ అమలు చేసి ఆరు గ్యారెంటీలు అమలు అయ్యాయని…
Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు- నష్టపోతున్న లక్షలాది మంది తెలంగాణ లబ్దిదారులు అంటూ లేఖలో పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు. రేషన్ కార్డులు జారీ చేసే విషయంలో మీ ప్రభుత్వం కోతలు పెడుతూ, పేద ప్రజలను మోసం చేయాలని చూడటం దుర్మార్గమని, అభయహస్తం మేనిఫెస్టోలో అర్హులైన వారందరికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి, ఇప్పుడు…
Thatikonda Rajaiah : స్టేషన్ ఘనాపూర్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత లను తిట్టడం ఫ్యాషన్ అయ్యిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో ఆ నలుగురి దగ్గర అంతరంగికుడిగా ఉన్న కడియం.. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం విడ్డూరమన ఆయన మండిపడ్డారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి, పార్టీకి పుట్టిన పిల్లలను.. కాంగ్రెస్ పార్టీ పిల్లలు అనడం హాస్యాస్పదమని…
MLC Kavitha : తెలంగాణలో బీడుగా మారిన భూములకు కృష్ణా జలాలను మళ్లించే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి సత్ఫలితాలను అందించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కవిత తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. “కృష్ణా జలాల్లో మా వాటా మాకే” అనే కేసీఆర్ పోరాటం విజయవంతమై, దీని ఫలితాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య…