Minister Seethakka : సోషల్ మీడియా ప్రస్తుతం రాజకీయాల్లో, సామాజిక అంశాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, దీని ప్రభావం కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి సీతక్క చిట్చాట్లో పంచుకున్నారు. సీతక్క మాట్లాడుతూ, సోషల్ మీడియా తనకు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టిందని వెల్లడించారు. ముఖ్యంగా, తన ఫోటోలను మార్ఫింగ్ చేసి, మానసికంగా ఆవేదనకు గురిచేసిన ఘటనలు బాధించాయని తెలిపారు. మరికొన్ని పోస్టులు ఆమెను డీమోరలైజ్ చేయడమే కాకుండా,…
తెలంగాణ శాసన సభ, మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. మండలి ప్రారంభమైన కాసేపటికే శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. పసుపుకు 15 వేల మద్దతు ధర చెల్లించాలని.. పసుపు రైతులను వెంటనే ఆదుకోవాలి అంటూ నిరసన చేపట్టారు.
Beerla Ilaiah: హరీష్ రావు ముఖ్యమంత్రి కుర్చీని అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారు అని ప్రభుత్వ విప్ బీర్ల ఐల్లయ్య అన్నారు. నిన్న గవర్నర్ ప్రసంగం అడ్డుకునే ప్రయత్నం చేశారు.. తెలంగాణ ప్రజానీకం గమైస్తున్నది.. మీరు ప్రజా ప్రతినిధుల లెక్క వ్యవహరిస్తలేరు పందికొక్కుల్లా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు.
నార్సింగి పోలీస్స్టేషన్లో సీఎం రేవంత్రెడ్డిపై 2020లో నమోదైన కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులతోపాటు ఫిర్యాదుదారుకూ నోటీసులు జారీ జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. 2020లో కేటీఆర్ ఫాంహౌజ్పైన డ్రోన్ ఎగరేసి చిత్రీకరించారని రేవంత్ రెడ్డి పై అభియోగం మోపారు. జీవో నెం. 111ను ఉల్లంఘించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫాంహౌజ్ నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
MLC Kavitha: తెలంగాణ రాష్ట్ర సమస్యలకు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత. ఇందులో భాగంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పై, అలాగే ఇతర సమస్యలపై ఆమె విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ పేగులు తెగేలా పోరాడిందని, అప్పటి కష్టం మరువలేనిదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కొన్ని సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆ పోరాటంలో కొంతమందికి…
బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న వేళ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా జరిపేందుకు పార్టీ శ్రేణులు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏప్రిల్ 27న జరగబోయే బహిరంగ సభపై పార్టీ నేతలతో కేసీఆర్ సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రక్షణ కవచం…
తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల ప్రక్రియకు తెర లేచింది. పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చేలోపే అందుకు సంబంధిచిన షెడ్యూల్ విడుదలైపోయింది. ఈనెల 20న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. పదో తేదీ నామినేషన్ దాఖలుకు ఆఖరు. ఈ క్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది.
కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు చాలా విస్తృతంగా సమావేశం జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏడాది పాటు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ నాటికి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. "ఈ రోజు చాలా విస్తృతంగా, సుదీర్ఘంగా సమావేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మా పార్టీ ముఖ్యులు 30 మంది మాట్లాడారు. తెలంగాణకు ఏనాటికైనా బీఆర్ఎస్సే రక్షణ…
నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఉపఎన్నికలు వస్తాయని బాంబు పేల్చారు. "సిల్వర్ జూబ్లీ వేడుకలే ఇంపార్టెంట్. ఈ సీఎం ఇంతలా ప్రజల్లో వ్యతిరేకత ఇంత తొందరగా వస్తుందనుకోలేదు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 19 వ తేదీన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ నిర్ణయించారు.