తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారు. పంచాంగ శ్రావణ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ భవన్ లో పంచాంగ శ్రవణం జరిగింది. పంచాంగ శ్రవణం ప్రకారం.. ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు కనిపిస్తాయి. సంపూర్ణ వర్షాలు పడతాయి. ప్రభుత్వం పాలన చేయడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. కేంద్రం నుండి వచ్చే సహకారం కూడా తీసుకునే అవకాశం ఉండదు. పత్తి పంటలకు మంచి అవకాశం. ఎర్ర నేలలో వేసే పంటకు మంచి అవకాశం. వస్త్ర పరిశ్రమలు కొత్తగా వెలుస్తాయి అభివృద్ధి బాగుంటుంది.
READ MORE: Cancer Survey: బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు లేవు.. తేల్చిన వైద్య ఆరోగ్య శాఖ!
ప్రభుత్వం ప్రకటించిన పథకాలు నమ్ము మాత్రం గానే ముందుకు వెళ్తాయి. కొన్ని రోజుల తర్వాత పోలీస్ వ్యవస్థకు ఎక్కువ అధికారాలు వచ్చే అవకాశం. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీఆర్‌ఎస్‌దే విజయం. కాని ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు రాదు. కోర్టులో ప్రభుత్వనికి మొట్టి కాయలు వేస్తారు.. కేసీఆర్‌కి ఈ సంవత్సరం మంచిగా ఉంది. వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.
READ MORE: Maoists: మావోయిస్టుల ఘాతుకం.. అమాయకుడి గొంతు కోసి దారుణ హత్య