బీజేపీ నేత బీఎల్ సంతోష్ అంటున్నాడు.. తెలంగాణ లో హంగ్ వస్తుంది అని.. బీజేపీని నిలవరించడానికి కాంగ్రెస్ కొట్లాడుతుంది అని రేవంత్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హంగ్ వస్తే బీజేపీతో కలిసేది ఎవరు.. బీఆర్ఎస్ కాదా?.. అని ఆయన ప్రశ్నించారు.
మహిళను తొలగించి వస్తావా.. ఇన్ని రోజులు కేటీఆర్ తన దోస్తు కోసం అభివృద్ధి చేయలేదు అని ఎమ్మెల్యే రేఖానాయక్ ఆరోపించారు. నేను పార్టీలో ఉండను.. మహిళలకు బీఆర్ఎస్ లో చోటులేదు.. రాజీనామా చేస్తున్నాను అంటూ ఆమె వెల్లడించారు.
నేడు జగిత్యాలలో ఐటీ& పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. జగిత్యాల పట్టణంలో 322.90 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ రేపు (ఆదివారం) తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా తన పర్యటనకు ముందు కాంగ్రెస్ , బీఆర్ఎస్లపై ఆయన విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా తెలుగులో ట్వీట్ చేశారు.
జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య ప్రజా ప్రతినిధులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు తన వెంట ఉన్న వారు లింగాల గణపురం మండలం కేంద్రంలో జరిగిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హాజరు కాకపోవడం వారిపై ఆయన పరోక్షంగా చురకలాంటించారు.
BRS Party: తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు సాయిచంద్ కుటుంబానికి బీఆర్ఎస్ ఆర్థిక సాయం చేసింది. ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడంతో సాయిచంద్ కుటుంబాన్ని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ రూ. 1.50 కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.