తెలంగాణలో మా ప్రయాణం బీఆర్ఎస్ పార్టీతోనే అని అసెంబ్లీ సాక్షిగా అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పని తీరును, మైనారిటీలకు ఈ ప్రభుత్వం అందిస్తున్న చేయూతను అక్బరుద్దీన్ ఒవైసీ కొనియాడారు.
లోక్సభలో ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లును బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది. బీఆర్ఎస్ తరఫున చర్చలో ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమల రంగంలో దూసుకెళ్తున్నామని, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నా కూడా ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు.
MLC Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి పోటీ చేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇవాళ సాయంత్రం ఖమ్మంలో జరిగే జనగర్జన సభను ఫెయిల్ చేయాలని అధికార పార్టీ తెగ ప్రయత్నాలు చేస్తోంది అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ పాల్గొంటున్నందున సభను నిర్వహించనివ్వద్దని కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకం ద్వారా దళితులకు ఆర్థికంగా చేయూతను అందిస్తున్నారు. ఈ పథకం అమలుపై ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తొలి విడత దళితబంధు విజయవంతం కావడంతో తెలంగాణ ప్రభుత్వం తాజాగా రెండో విడత లబ్ధిదారుల ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.