రైతు బంధు పథకం కొత్తది కాదు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈసీనీ కాంగ్రెస్ నేతలు కలిసి రైతు బంధు ఆపాలని కోరింది అని ఆయన తెలిపారు. కేసీఅర్ రైతు బంధు తర్వాతే కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ తీసుకు వచ్చింది.. రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు.. 69 లక్షల మందికి రైతు బందు అందుతోంది.
రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నలు ఈ ఎన్నికలు.. ఒక్క కేసీఆర్ ను కొట్టడానికి ఎన్ని సమీకరణాలు మారుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు.. రైతులు, మహిళలను ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోంది.. మైనార్టీల ఓట్లు డివైడ్ కావడం వల్ల ప్రజలకు నష్టం.. కాంగ్రెస్ కు ఎన్నికలు ఓ ఆట.. మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా చూస్తోంది అని ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు.
సీఎం కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఆసరా పెన్షన్ ఐదు వేలకు పెంచుతామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డిలోని నాల్సబ్ గడ్డలో బీఆర్ఎస్లో చేరికల కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పలువురిని పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీని విమర్శించేస్థాయి కేటీఆర్, హరీష్, కవితలకు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా జానారెడ్డి హాజరయ్యారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చే హామీలు అమలైనట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు.
సంగారెడ్డి గడ్డపై ఈ సారి గులాబీ జెండా ఎగరేస్తామని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఎన్ని గ్రామాల్లో తిరిగారని ఆయన ప్రశ్నించారు.
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మీద ప్రజలకు విసుగు ఉంది అని ఆయన అన్నారు. అపుడు కాంగ్రెస్ పాలనలో చేసిన పాపాలను ప్రజలు మరచిపోవడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ మహిళా అభివృద్ధి సంస్థ ఛైర్పర్సన్ ఆకుల లలిత రాజీనామా చేశారు.