Harish Rao Slams Congress Government: కాంగ్రెస్ పరిపాలనకు నిన్నటికి రెండేళ్లు పూర్తయింది.. ఒక్క మాట చెప్పాలంటే కాంగ్రెస్ రెండేళ్ల మొండిచేయి చూపెట్టిందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. తాజాగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పాలన ఆగమాగం ఉందన్నారు. మొదటి రెండేళ్లు పాలన గీటురాయిలా ఉంటుంది.. కానీ ఈ రెండేళ్లు ఏమీ చేయలేదన్నారు. ఈ పాలన నిస్పారం నిరర్ధకం లాగా ఉంది.. మా ప్రభుత్వం రాగానే ఎన్నో కొత్త…
Harish Rao: అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు మాజీమంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. శాసనసభ నిబంధనలను పట్టించుకోకుండా అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని పేర్కొన్నారు. "రెండేళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసే లేదు. డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని గాలికి వదిలేశారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తున్నారు. రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదు. ఏడాదికి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలి. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహణను సరిదిద్దాలి.
Kavitha: మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రెండు రోజుల క్రితం హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో కవిత అంత్యక్రియలకు హాజరుకాలేదు. దీనితో హరీష్‌రావుతో ఉన్న విభేదాల కారణంగానే రాలేదని అనేక ఊహాగానాలు చెలరేగాయి. అయితే మూడు రోజుల తర్వాత, గురువారం ఉదయం కవిత హరీష్‌రావు నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను కలుసుకున్నారు.
KCR: మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తన్నీరు హరీష్‌రావు తండ్రి సత్యనారాయణ ఈ రోజు తెల్లవారు జామున మృతి చెందిన విషయం తెలిసిందే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా హరీష్‌రావు ఇంటికి చేరుకున్నారు. తన బావ తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. భర్తను కోల్పోయిన అక్క లక్ష్మమ్మకు ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి హరీష్‌రావుని కౌగిలించుకుని ఓదార్చారు.
Harish Rao Father Death: బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈరోజు వేకువజామున కన్నుమూశారు. ఆయన మృతితో హరీశ్ రావు కుటుంబంలో, బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి, తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, వారి మృతి పట్ల విచారం…
KTR : జైపూర్‌లో జరుగుతున్న టాక్ జర్నలిజం 9వ ఎడిషన్ చర్చా కార్యక్రమంలో తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేశ రాజకీయాలు, నియోజకవర్గ పునర్విభజన, భాషా విధానాలు వంటి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ బీహార్ ఎన్నికల ఓటర్ల సవరణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం, పార్లమెంటు సీట్ల కేటాయింపులోని అసమానతలపై విస్తృతంగా మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడుతూ, “బీహార్‌లో జరుగుతున్న ఎన్నికల ఓటర్ల సవరణ ఇది…
KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు. అనంతరం చికిత్స అందిస్తున్న వైద్యులతో ఆమె మాట్లాడారు. గత గురువారం సాయంత్రం కేసీఆర్ అస్వస్థతకు గురికావడంతో వైద్యుల సలహాతో ఆస్పత్రిలో చేరారు. అనంతరం వైద్య బృందం ఆయనకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించింది. Love Marriage: లవ్ మ్యారేజ్.. ఏడాది…
MLC Kavitha : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి మాట్లాడే భాష, ఆయన ప్రస్తావించిన అంశాలు నీచంగా, బాధకరంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. కవిత వివరించగా, గతంలో కంచ గచ్చిబౌలిలో ప్రభుత్వ భూములను అమ్మి ఆదాయం పొందాలనే ప్రయత్నం ప్రభుత్వం చేసినప్పటికీ అది విఫలమైంది. భవిష్యత్తులో పరిశ్రమల అభివృద్ధి కోసం TG IIC ద్వారా మాజీ ముఖ్యమంత్రి…
Kotha Prabhakar Reddy : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి తన దూకుడు వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అయ్యారు. NTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన, పార్టీ నేతలపై ఘాటుగా విరుచుకుపడ్డారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చమని మా నాయకుడు కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదు. అలాగే మేము కూడా ప్రభుత్వాన్ని కూల్చే…
Rahul Gandhi: గురువారం నాడు పార్లమెంట్‌లో చోటుచేసుకున్న సంఘటనలో గాయపడ్డ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజపుత్‌లను ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బండి సంజయ్ పరామర్శించారు. పార్లమెంట్‌లో జరిగిన తోపులాటలో ఇద్దరు ఎంపీలు గాయపడటం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. వరుస ఓటముల కారణంగా ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో అసహనం పెరిగిందని…