All Quiet:'బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్' (బి.ఎఫ్.టి.ఎఫ్.ఏ) అవార్డులకు 'బ్రిటన్ ఆస్కార్స్' అనే పేరుంది. ఇక్కడ విజేతలుగా నిలచిన చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రభావం అమెరికాలో జరిగే 'అకాడమీ అవార్డులు' (ఆస్కార్ అవార్డ్స్)పై కూడా ఉంటుందని సినీ ఫ్యాన్స్ విశ్వసిస్తారు.
అమెరికన్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్, బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ వంటి ప్రఖ్యాత సంస్థలతో పాటు సి.సి.ఏ, డి.జి.,ఏ, హెచ్ ఎఫ్.పి.ఏ, యన్.బి.ఆర్, పి.జి.ఏ, ఎస్.ఏ.జి వంటి సినిమా సంబంధిత సంస్థలు ప్రతీసారి అకాడమీ అవార్డ్స్ పై తమ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సంస్థలు ఎంపిక చేసిన చి