గత కొద్దీ రోజుల నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన నయం చేయలేని వ్యాధి బారిన పడ్డారని, అందుకే చికిత్స తీసుకుంటున్నారని కొందరు బాహాటంగానే వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా పుతిన్ ఆరోగ్య పరిస్థితిపై బ్రిటన్ మాజీ గూఢచారి క్రిస్టఫర్ స్టీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్లాదిమిర్ పుతిన్ బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నారని ఓ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రిటన్ మాజీ గూఢచారి…