వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. వంతెనలు, సొరంగాలు ఉన్న జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గించింది. 2008 నాటి నియమాలను తాజాగా కేంద్రం సవరించింది. దీంతో జాతీయ రహదారులపై కొత్త ఆదేశాల ప్రకారం 50 శాతం టోల్ ఫీజులు తగ్గనున్నాయి.
బీహార్‌లో ప్రారంభోత్సవానికి ముందే ఓ బ్రిడ్జి కూలిపోయింది. బీహార్‌లోని అరారియాలో రూ.12 కోట్ల రూపాయలతో వంతెనను నిర్మించారు. అయితే వంతెన ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలిపోయింది.
దేశంలో ఐదవ దశ లోక్‌సభ ఎన్నికలు కాసేపటి క్రితమే ముగిశాయి. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ కొనసాగింది. అయితే.. ఉత్తర ప్రదేశ్ లోని రెండు గ్రామాలు, జార్ఖండ్‌లో ఒక గ్రామ ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. దీనికి కారణమేంటని ఆరా తీయగా.. తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేదని.. అందుకే తాము ఓటు వేయడం లేదని తెలుపుతున్నారు. తమ గ్రామ అభివృద్ధి గురించి పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం…
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుజరాత్‌కు చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందారు. సౌత్ కరోలినాలోని గ్రీన్‌విల్లే కౌంటీలోని వీరు ప్రయాణిస్తున్న కారు హైవేమీద నుంచి వంతెనపైకి దూసుకెళ్లడంతో అక్కడిక్కడే ముగ్గురు ప్రాణాలు వదిలారు.
Peddapalli: ఈదురు గాలులకు పెద్దపల్లి జిల్లా మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటన ముత్తారం మండలం ఓడేడులో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
ప్రస్తుతం భారత్, శ్రీలంక దేశాల మధ్య కేవలం వాయు, నీటి మార్గాలే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇరు దేశాల మధ్య రోడ్డు మార్గాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి శ్రీలంక ప్రభుత్వం, భారత సర్కార్ దగ్గర ప్రతిపాదనలను ఉంచింది. సముద్రంలో వంతెన నిర్మించాలని తాజాగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు ఉత్తరాది విలవిల్లాడుతోంది. కొండలు, కోనలు దొర్లిపడుతున్నాయి. వరద నీటి ప్రవాహానికి ఇళ్లు, మార్కెట్లు, వంతెనలు కొట్టుకుపోతున్నాయి..లోతట్టు ప్రాంతాలు జలమయమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వరద ముప్పు ఏర్పడింది. ఇప్పటికే వాగులు, వంకలు, నదులు వరద ఉధృతితో అడ్డొచ్చినవాటిని కొట్టుకుంటూ పోతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో ఎక్కడికక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయి.…
మహారాష్ట్రలోని వివిధ పట్టణాలు, నగరాల పేర్లను మార్పు చేస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా కొన్ని పట్టణాలను ఇప్పటి వరకు ఉన్న పేర్లతో కాకుండా ఆయా పట్టణాలకు పేర్లను మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి.
బీహార్‌లోని రోహతాస్ జిల్లాలో వంతెన స్లాబ్, పిల్లర్ మధ్య చిక్కుకున్న 11 ఏళ్ల బాలుడిని రక్షించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గురువారం ప్రాణాలు కోల్పోయాడు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం రెస్క్యూ ఆపరేషన్‌కు నాయకత్వం వహించింది.
ఆదివారం భాగల్పూర్లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడానికి బీజేపీనే కారణమని బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. "బీజేపీ వంతెన కూలిపోవడానికి కారణమైంది. మేము వంతెనలను నిర్మిస్తాము.. బీజేపీ వాటిని నాశనం చేస్తూనే ఉంది" అని తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు.