బీహార్‌లో ప్రారంభోత్సవానికి ముందే ఓ బ్రిడ్జి కూలిపోయింది. బీహార్‌లోని అరారియాలో రూ.12 కోట్ల రూపాయలతో వంతెనను నిర్మించారు. అయితే వంతెన ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలిపోయింది. సిక్తి, కుర్సకాంత బ్లాక్‌లను కలుపుతూ బక్రా నదిపై రూ.12 కోట్ల రూపాయల వ్యయంతో వంతెనను నిర్మించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. ఇందుకు ఫొటోలు, వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Rohit Sharma: సూపర్ 8 మ్యాచ్లపై టీమిండియా కెప్టెన్ కీలక వ్యాఖ్యలు..
ఈ ఏడాది మార్చిలో కూడా బీహార్‌లోని సుపాల్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 10 మంది గాయపడ్డారు. కోసి నదిపై నిర్మిస్తున్న వంతెన స్లాబ్ కూలిపోవడంతో భేజా మరియు బకౌర్ మధ్య ఉన్న మరీచా దగ్గర ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి: Nag Ashwin: కల్కి 2898 ఏడీ కథ లీక్ చేసిన నాగ్ అశ్విన్
Bihar | A portion of a bridge over the Bakra River collapsed in Araria. Details awaited
(Screengrabs of a viral video) pic.twitter.com/02hLGD9Sbd
— ANI (@ANI) June 18, 2024