మండపం నుంచి పెళ్లికూతురు పరారీ.. ఆఖరి నిమిషంలో ఆగిన పెళ్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఖరి నిమిషంలో పెళ్లి ఆగిపోయిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగింది.. దీంతో పెళ్లి ఆగిపోయింది.. ఇక, హర్ట్ అయిన పెళ్లి కుమారుడు, ఆ కుటుంబం.. పరువు నష్టం కింద రెండు లక్షల రూపాయలు చెల్లించాలని పోలీసులను ఆశ్రయించారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం హోస్పేటకు చెందిన రామానుజులుతో, తంబళ్లపల్లె కు చెందిన తిరుమల కుమారితో గత జూలై 7న నిశ్చితార్థం జరిగింది.. ఇవాళ ఉదయం మదనపల్లిలో పెళ్లి జరగాల్సి ఉంది.. అయితే, నిన్న రాత్రి కళ్యాణ మండపం నుంచి వధువు తిరుమల కుమారి పరారైంది.
సమీప బంధువులతో పాటు మరో యువకుడితో గత రాత్రి పెళ్లి కూతురు వెళ్లిపోయిందని, ఈ ఉదయం మరో వ్యక్తితో ఆమెకు వివాహం జరిగిందని వరుడి కుటుంబీకులు చెబుతున్నారు.. ఈ ఘటనపై మదనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు వరుడు, వారి కుటుంబీకులు… నమ్మించి తనను మోసం చేశారని, తమకు పరువు నష్టం అని వాపోతున్న వరుడు… అందుకు పరిహారంగా రెండు లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు. వరుడు రామానుజులు ఫిర్యాదు మేరకు ఘటనపై విచారణ జరుపుతున్నారు పోలీసులు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..