ఏపీ ప్రభుత్వం గ్యారెంటీ పెన్షన్ స్కీం-GPS చట్టాన్ని అమలు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. కానీ.. ఇది టీడీపీ ప్రభుత్వం విడుదల చేసింది కాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసింది. అయితే ఈ జీపీఎస్‌కు సంబంధించిన ఫైల్‌పై గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఆయన సెలవుపై వెళుతూ పెండింగ్ ఫైల్స్‌పై సంతకాలు పెట్టారు. ఈ ఫైల్స్‌లో జీపీఎస్‌కు సంబంధించిన ఫైల్ కూడా ఉందట.…
Earth Quake in Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో నేడు భూకంపం సంభవించింది. కాశ్మీర్ లోని బారాముల్లాలో ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రకంపనలు రావడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. దింతో వారు రోడ్లపైకి పరుగులు తీశారు. ఇకపోతే, ఈరోజు మధ్యాహ్నం 12:25 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంపం తర్వాత బారాముల్లాలో ప్రజలలో గందరగోళం నెలకొంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండడంతో…
బియ్యం, కందిపప్పు ప్రత్యేక కౌంటరు సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజారులో ప్రత్యేక కౌంటరు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం లోని రైతుబజారులో కందిపప్పు, బియ్యం స్టాల్ ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. బియ్యం, కందిపప్పు సబ్సిడీ ధరలకు రైతు బజారులో అందుబాటులో ఉంచనుంది ప్రభుత్వం. నిత్యావసర సరకులను రాయితీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంది. రైతుబజార్లలో రాయితీపై బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు…
కేంద్ర మంత్రి బండి సంజయ్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని బండి సంజయ్ విమర్శించారు. స్వామి వారిపై భక్తి లేని వారు నామాలు పెట్టుకుని… స్వామికి, టీటీడీ ఆస్తులకు పంగనామాలు పెట్టారని బండి సంజయ్ విమర్శించారు. అంతేకాకుండా.. ఇతర మతస్తులకు అధికారాన్ని అప్పగించి తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేశారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లు వీరప్పన్…
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైతు బజార్లో బియ్యం, కందిపప్పు సరసమైన ధరలకు విక్రయిస్తున్నా కౌంటర్‌ను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. నిన్న మొన్నటి వరకు ప్రజలపై ఏ విధంగా భారం పడిందో చూసామన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పదవి చేపట్టిన నాటి నుండి తనిఖీలు చేపట్టిన తర్వాత అవినీతి బయటపడిందని ఆమె వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రజా కంటక ప్రభుత్వంలో దారుణాలు జరిగాయని ఆమె విమర్శించారు. ఇప్పుడు ప్రజా రంజికపాలన అధికారంలోకి వచ్చిందన్నారు. నరేంద్ర…
పల్నాడును డయేరియా వణికిస్తోంది. గడిచిన 15 రోజులుగా డయేరియాతో పాటు ఇతర అనారోగ్య కారణాలతో ఏడుగురు మృతి చెందారు. డయేరియా కారణాలతో నలుగురు , ఇతర అనారోగ్య కారణాలతో, ముగ్గురు మరణించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. పిడుగురాళ్ల , మారుతి నగర్ , లెనిన్ నగర్ ప్రాంతాల్లో డయేరియా విజృంభించినట్లు అధికారులు వెల్లడించారు. పల్నాడులో గడిచిన రెండు వారాలుగా డయేరియా ప్రభావంతో 160 మంది కి పైగా ప్రజలు అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. 100 మందికి పైగా…
పిడుగురాళ్లలో డయేరియా కేసులపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. డయేరియాకు కారణాలు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మున్సిపల్, వైద్యారోగ్య శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి నారాయణ. అయితే.. మున్సిపాలిటీ పరిధిలో మంచినీటి పైప్ లైన్ల లీకేజిలను అరికట్టినట్లు చెప్పిన కమిషనర్… పట్టణంలోని బోర్లను మూసేసి ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. డయేరియా కేసులు పెరగకుండా శానిటేషన్, బ్లీచింగ్, మురుగు కాలువల్లో స్ప్రే చేయడం, ఫాగింగ్ చేస్తున్నట్లు కమిషనర్ మంత్రి…
నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను తగ్గించి గురువారం నుంచి రైతు బజార్లలో విక్రయిస్తారని రాష్ట్ర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాష్ట్రంలో నిత్యావసర సరకులను ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంచడం, వారికి ఉపశమనం కలిగించడం అవసరమని శ్రీ మనోహర్ గారు తెలిపారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.181 ఉన్న కందిపప్పు రూ.160, బియ్యం రూ.52.40 ఉంటే రూ.48కీ, స్టీమ్డ్ బియ్యం రూ.55.85 ఉంటే రూ.49 చొప్పున…
విజయనగరం జిల్లాలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటంచనున్నారు. ఇందుక అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఇప్పకే 25 శాతం పనులు పూర్తాకగా, మిగిలన పనులను సీఎం పరిశీలించనున్నారు. టెర్మినల్, రన్ వే, అప్రోచ్ రోడ్లుల పనుల ఏమేరకు జరిగాయని సీఎం పరిశీలించనున్నారు. అధికారులు ఇందు కోసం ఏర్పాటు చకచకా చేశారు. తొలిత రన్‌వేపై ఏర్పాటు చేస్తున్న…
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని దారుణంగా హతమార్చిన నిందితుడు సురేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంబిల్లి మండలం కొప్పగుండుపాలెం శివారులో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 6న సురేశ్ దర్శిని ఇంటికి వెళ్లి కత్తితో దారుణంగా చంపేశాడు. ప్రేమ పేరుతో వేధించడంతో దర్శిని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సురేశ్ జైలుకు వెళ్లాడు. ఆ కోపంతోనే హతమార్చినట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంనకు చెందిన బద్ది దర్శిని రాంబిల్లి జిల్లా…